ఈ ప్రసంగంలో, “ధర్మ అవగాహనం” అనే సిరీస్ యొక్క పదవ ఎపిసోడ్లో సహాయం కోరడం (ఇస్తిఆన) అనే అంశం గురించి వివరించబడింది. ఇస్లాంలో సహాయం కోరడంలో నాలుగు రకాలు ఉన్నాయని బోధకుడు వివరిస్తున్నారు. మొదటిది, అల్ ఇస్తిఆనతు బిల్లాహ్ – అల్లాహ్ యే సహాయం కోరడం, ఇది తౌహీద్ యొక్క పునాది. రెండవది, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్ – పుణ్య కార్యాల కోసం సృష్టి జీవుల నుండి సహాయం తీసుకోవడం, ఇది ధర్మసమ్మతమే. మూడవది, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్ – మరణించిన వారి నుండి సహాయం కోరడం, ఇది షిర్క్ (బహుదైవారాధన) మరియు తీవ్రమైన పాపం. నాల్గవది, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా – సహనం, నమాజ్ వంటి సత్కర్మల ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్థించడం, ఇది ప్రోత్సహించబడింది. ప్రసంగం ముగింపులో, ఖుర్ఆన్ మరియు హదీసుల ప్రకారం సరైన మార్గంలో సహాయం కోరే సద్బుద్ధిని ప్రసాదించమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ముగించారు.
اَلسَلامُ عَلَيْكُم وَرَحْمَةُ اَللهِ وَبَرَكاتُهُ (అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు)
అభిమాన సోదరులారా! ధర్మ అవగాహనంఅనే ఈ పదవ ఎపిసోడ్ లో మనం సహాయం కోరుకోవటం అనే విషయం గురించి తెలుసుకుందాం. మనిషి పలు రకాలుగా సహాయాన్ని కోరుకుంటాడు. ఈ ఎపిసోడ్లో మనం నాలుగు రకాలు తెలుసుకుందాం.
మొదటిది: అల్లాహ్ తో సహాయం కోరడం (అల్ ఇస్తిఆనతు బిల్లాహ్)
మొదటిది అల్ ఇస్తిఆనతు బిల్లాహ్, అల్లాహ్ తో సహాయాన్ని అర్థించటం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ ఫాతిహాలో ఇలా తెలియజేశాడు:
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (ఇయ్యాక న’అబుదు వ ఇయ్యాక నస్త’ఈన్) “మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము..” (1:5)
ఈ ఆయత్ సూరహ్ ఫాతిహాలోని ఆయత్. దీనిని మనం ప్రతిరోజూ, ప్రతి నమాజులో, ప్రతి రకాతులో పఠిస్తాము. దీని అర్థం: ఓ అల్లాహ్, మేము నిన్నే ఆరాధిస్తాము, సహాయం కోసం నిన్నే అర్థిస్తాము, నీతోనే సహాయం కోరుతాము, ఇతరులతో సహాయము కోరము అని అర్థం.
అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
وَإِذَا اسْتَعَنْتَ فَاسْتَعِنْ بِاللَّهِ (వ ఇదస్త’అంత ఫస్త’ఇన్ బిల్లాహ్) “సహాయం కోసం అర్థిస్తే అల్లాహ్ తోనే అర్పించండి.”
దీని పరంగా, ఇతరులను సహాయం కోసం మొరపెట్టుకోవటం, సహాయం కోసం ఇతరులను పూజించటం ధర్మసమ్మతం కాదు. అది షిర్క్ అవుతుంది, ఇబాదాలో షిర్క్ అవుతుంది, తౌహీద్ ఉలూహియ్యతులో షిర్క్ అవుతుంది. ఇది మొదటి విషయం. ఇటువంటి సహాయం అల్లాహ్ తోనే కోరాలి, ఇతరులతో కోరకూడదు.
రెండవది: సృష్టితాల సహాయం (అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్)
ఇక రెండో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ మఖ్లూఖాత్. అంటే, సృష్టితాల సహాయం. కారకాలకు లోబడి, ఒకరికొకరి సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతమే. దీన్ని ఇస్లాంలో ప్రోత్సహించటం కూడా జరిగింది. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ మాయిదాలో ఇలా తెలియజేశాడు:
మంచికి, దైవభీతికి సంబంధించిన విషయాలలో ఒకరికొకరికి అందరితోనూ సహకరించండి. మంచి విషయాలలో, పుణ్య విషయాలలో, దైవభీతికి పుట్టిన విషయాలలో అందరితోనూ సహకరించండి. వలా త’ఆవనూ అలల్ ఇస్మి వల్ ఉద్వాన్, అంటే పాప కార్యాలలో, అధర్మ విషయాలలో, ఖుర్ఆన్ మరియు హదీసులకి విరుద్ధమైన విషయాలలో సహకరించకండి. అంటే, కారకాలకు లోబడి, పరస్పరం మనము చేయగలిగే విషయాలలో సహాయం తీసుకోవటం, ఇది ధర్మసమ్మతమే.
మూడవది: మరణించిన వారి సహాయం (అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్)
ఇక మూడో విషయానికి వస్తే, అల్ ఇస్తిఆనతు బిల్ అమ్వాత్, చనిపోయిన వారి సహాయం తీసుకోవటం. ఇది షిర్క్, అధర్మం, అసత్యం, ఇది ఘోరమైన పాపం, ఇది షిర్క్ కిందికి వచ్చేస్తుంది, పెద్ద షిర్క్ అవుతుంది. ఎందుకంటే, చనిపోయిన వారు, తల్లిదండ్రులైనా, పితామహులైనా, స్నేహితులైనా, సజ్జనులైనా, గురువులైనా, పండితులైనా, ఔలియాలు అయినా, ప్రవక్తలు అయినా సరే, చనిపోయిన వారు చనిపోయిన తర్వాత మన పిలుపుని వారు వినలేరు. మన సమస్యల్ని వారు దూరం చేయలేరు. కావున చనిపోయిన వారి సహాయాన్ని కోరటం ఇది ధర్మసమ్మతం కాదు, షిర్క్ క్రిందికి వస్తుంది. ఈ విషయం గురించి మనము బాగా జాగ్రత్త పడాలి.
నాల్గవది: సత్కర్మల ద్వారా సహాయం (అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా)
ఇక నాలుగో విషయం, అల్ ఇస్తిఆనతు బి అ’మాలే సాలిహా, సత్కర్మల ద్వారా సహాయాన్ని కోరటం. ఇది ధర్మసమ్మతం. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతుల్ బఖరాలో ఇలా తెలియజేశాడు:
وَٱسْتَعِينُوا۟ بِٱلصَّبْرِ وَٱلصَّلَوٰةِ (వస్త’ఈనూ బిస్సబ్రి వస్సలాహ్) “మీరు ఓర్పు ద్వారా, నమాజు ద్వారా సహాయం అర్థించండి.” (2:45)
మీరు సహనం ద్వారా, సలాహ్, నమాజ్ ద్వారా అల్లాహ్ సహాయాన్ని అర్పించండి, కోరండి అని. దీన్ని బట్టి, మంచి పుణ్యాల ద్వారా, సత్కర్మల ద్వారా, సహనం నమాజుల ద్వారా సహాయాన్ని కోరవచ్చు.
అభిమాన సోదరులారా! ఈ సహాయం అనే విషయంలో, ఖుర్ఆన్ మరియు హదీస్ కి అనుగుణంగా నడుచుకునే, ఆచరించే సద్బుద్ధిని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ ప్రసాదించుగాక. ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.
ధర్మ అవగాహనం– హబీబుర్రహ్మాన్ జామయి [వీడియోలు & టెక్స్ట్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో, ‘ఔలియా అల్లాహ్’ (అల్లాహ్ యొక్క మిత్రులు) యొక్క నిజమైన అర్థం మరియు నిర్వచనంపై దృష్టి సారించారు. వక్త ‘వలీ’ (ఏకవచనం) మరియు ‘ఔలియా’ (బహువచనం) అనే పదాల భాషాపరమైన మరియు మతపరమైన అర్థాలను వివరిస్తారు. సూరహ్ యూనుస్ లోని 62 మరియు 63 ఆయతుల ద్వారా ఖురాన్ యొక్క నిర్వచనాన్ని స్పష్టం చేస్తారు, దీని ప్రకారం ఔలియా అల్లాహ్ అంటే విశ్వసించి, దైవభీతి (తఖ్వా)తో జీవించేవారు. మహిమలు లేదా కరామాతులు చూపించడం అనేది ఔలియాగా ఉండటానికి అవసరమైన ప్రమాణం కాదని, అది ఒక తప్పుడు భావన అని వక్త నొక్కి చెబుతారు. అల్లాహ్ సామీప్యం అనేది కల్మషం లేని విశ్వాసం మరియు భయభక్తులతో కూడిన జీవన విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని, ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడేనని స్పష్టం చేశారు.
అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ అంబియాయి వల్ ముర్సలీన్, అమ్మా బాద్.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం. నా ఇస్లామీయ అభివాదం, అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
ఔలియా అల్లాహ్ అంటే ఎవరు?
ఈరోజు మనం, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు? తెలుసుకుందాం. వలీ, ఔలియా. వలియుల్లాహ్, ఔలియావుల్లాహ్ అంటే ఎవరో తెలుసుకుందాం.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62లో ఇలా సెలవిచ్చాడు.
أَلَا إِنَّ أَوْلِيَاءَ اللَّهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్) “వినండి! అల్లాహ్ మిత్రులకు ఎలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.” (10:62)
ఔలియా అల్లాహ్ గురించి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా చెప్పిన మాట ఇది, సూర యూనుస్ ఆయత్ నెంబర్ 62.
ఔలియా అనే పదం, వలీ అనే పదానికి బహువచనం. అంటే, వలీ ఏకవచనం, ఔలియా బహువచనం.
నిఘంటువు పరంగా వలీ అంటే సన్నిహితుడని అర్థం వస్తుంది. దీని ప్రకారం, ఔలియా అల్లాహ్ అంటే చిత్తశుద్ధితో, అల్లాహ్ కు విధేయత కనబరచి, చెడు నుండి తమను కాపాడుకుని దైవ సామీప్యం పొందేందుకు నిరంతరం పాటుపడిన వారు ఔలియాలు.
అల్లాహ్ స్వయంగా, ఈ ఆయత్ తర్వాత, “అలా ఇన్న ఔలియా అల్లాహి లా ఖవ్ఫున్ అలైహిమ్ వలాహుమ్ యహ్ జనూన్”, వినండి, ఔలియా అల్లాహ్ కు భయము గానీ, దుఃఖము గానీ ఉండదు అని చెప్పిన తర్వాత, ఔలియా అల్లాహ్ యొక్క నిర్వచనాన్ని అల్లాహ్ తెలియజేశాడు. స్వయంగా ఈ తర్వాతి ఆయత్ లో ఔలియా అల్లాహ్ ను నిర్వచించాడు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా. ఎవరు వారు?
الَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ (అల్లజీన ఆమనూ వ కానూ యత్తఖూన్) వారు విశ్వసించిన వారై, (చెడుల విషయంలో అల్లాహ్కు) భయపడేవారై ఉంటారు.(10:63)
ఔలియా అల్లాహ్ అంటే, విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వివరించాడు. అంటే విశ్వాసంతో పాటు తన పట్ల భయభక్తుల విధానాన్ని కలిగి ఉంటారు ఔలియాలు.
అభిమాన సోదరులారా, దీన్ని బట్టి అవగతమయ్యేది ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరేవారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడపాలి. ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే. వలియుల్లాహ్ యే అవుతాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దైవభీతిపరుడూ, వలియుల్లాహ్ యే అవుతాడు, అల్లాహ్ కు ప్రియతముడే అవుతాడు.
ఔలియా గురించి తప్పుడు భావనలు
కానీ, ఇక్కడ ఒక విషయం మనము గమనించాలి. సమాజంలో ఏం జరుగుతోంది. జనులు మాత్రం, సమాజంలో ఒక వర్గం వారు, కొందరు, వారు మాత్రం దీనిని ఒక ప్రహసనంగా మార్చారు. వలీ, ఔలియా అల్లాహ్ అంటే దీనిని ఒక ప్రహసనంగా మార్చేశారు. మహిమలు చూపే వారే అల్లాహ్ ప్రియతములు కాగలుగుతారని వారు భాష్యం చెప్పారు. తమ భాష్యాన్ని సమర్థించుకోవటానికి, తాము ఇష్టపడే వలీలకు స్వకల్పిత మహిమలను ఆపాదించారు.
అభిమాన సోదరులారా, ఈ విషయం గమనించండి, అల్లాహ్ సామీప్యం పొందటానికి, మహిమలు ప్రదర్శించటానికి అసలు సంబంధమే లేదు. ఒకవేళ ఎవరి ద్వారానైనా ఏదైనా మహిమ ప్రదర్శితమైతే, అది అల్లాహ్ ప్రణాళిక, దైవేచ్ఛ అని అనుకోవాలి. అంతేగానీ, అది ఆ వలీ తరఫు నుంచి జరిగిందని ఏమీ కాదు.
అలాగే, ఒక ధర్మానిష్ఠాపరుని ద్వారా, ఒక విశ్వాసి ద్వారా, ఒక దైవభీతిపరుని ద్వారా ఏదైనా మహిమ ప్రదర్శితం కాకపోయినంత మాత్రాన వారి భక్తి తత్పరతకు శంకించనవసరం లేదు, శంకించకూడదు. ఎవరి అంతర్యాలలో ఎంత భక్తి ఉందో, అది అల్లాహ్ కే బాగా తెలుసు.
అభిమాన సోదరులారా, సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సామీప్యం పొందగోరే వారు, నిష్కల్మషమైన విశ్వాసం కలిగి ఉండటంతో పాటు, భయభక్తులతో కూడుకున్న జీవితం గడిపే వారు ఔలియా అల్లాహ్ అవుతారు. అంటే ప్రతి దైవభీతిపరుడూ అల్లాహ్ కు ప్రియతముడే, అంటే వలియుల్లాహ్ యే అని అర్థమైంది. అలాగే ఈ మహిమలు, కరామాతులు ప్రదర్శితమైతేనే ఔలియా అల్లాహ్, లేకపోతే లేదు అనేది ఎటువంటి రూల్స్ లేదు. అలా వాటికి సంబంధం అసలు లేదు. మహిమలు, కరామాతులు, అది జరిగినా, జరగకపోయినా, ఔలియా అల్లాహ్ అవ్వటానికి సంబంధము లేదు. ఎవరి ఆంతర్యాలలో ఎంత భక్తి ఉందో అది అల్లాహ్ కే బాగా తెలుసు.
అభిమాన సోదరులారా, ఇది క్లుప్తంగా ఔలియా అల్లాహ్ అంటే ఎవరో మనం తెలుసుకున్నాం. ఇన్ షా అల్లాహ్, ఇంకా ఇతర విషయాలు వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
వ ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
అన్నింటి కంటే పెద్ద పాపం ఏది ? వక్త: హబీబుర్రహ్మాన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/oCuJTzug-YA [ 4 నిముషాలు]
ఈ ప్రసంగంలో, పాపం యొక్క నిర్వచనం, దాని రకాలు మరియు ఇస్లాంలో అన్నింటికంటే పెద్ద పాపం గురించి వివరించబడింది. ఒకరి మనస్సాక్షిని ఇబ్బంది పెట్టే మరియు ఇతరులకు తెలియకూడదని కోరుకునే చర్యే పాపం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. పాపాలు పెద్దవి (కబాయిర్) మరియు చిన్నవి (సఘాయిర్) అని రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. హత్య, వ్యభిచారం, దొంగతనం వంటివి పెద్ద పాపాల జాబితాలోకి వస్తాయి. అయితే, ఈ అన్నింటికంటే ఘోరమైన, అల్లాహ్ ఎప్పటికీ క్షమించని పాపం ‘షిర్క్’ – అంటే అల్లాహ్ కు భాగస్వాములను కల్పించడం లేదా బహుదైవారాధన చేయడం. పవిత్ర ఖుర్ఆన్ మరియు హదీసుల ఆధారంగా, సృష్టికర్త అయిన అల్లాహ్ తో ఇతరులను సాటి కల్పించడమే అత్యంత ఘోరమైన పాపమని స్పష్టం చేయబడింది.
అల్ హందులిల్లాహ్, వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మా బాద్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ ఆరవ ఎపిసోడ్ లో, మనం అన్నింటికంటే పెద్ద పాపం ఏది అనేది తెలుసుకుందాం.
అసలు పాపం దేనిని అంటారు? ఓ ఉల్లేఖనంలో, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి ఇలా తెలియజేశారు.
الْإِثْمُ مَا حَاكَ فِي صَدْرِكَ، وَكَرِهْتَ أَنْ يَطَّلِعَ عَلَيْهِ النَّاسُ (అల్ ఇస్ము మా హాక ఫీ సద్రిక్, వ కరిహ్త అన్ యత్తలిఅ అలైహిన్నాస్) పాపమంటే నీ హృదయంలో సంకోచం, సందేహం కలిగించేది మరియు ఇతరులకు తెలియటాన్ని నీవు ఇష్టపడనిది.
ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఏ పని పట్ల నీ మనసులో శంక కలుగుతుందో, మరీ దేని గురించి ప్రజలు తెలుసుకోవటం నీకు ఇష్టం లేదో, దీన్ని దురాచరణ అంటారు, పాపం అంటారు.
ఇక పాపం రెండు రకాలు. అల్ కబాయిర్ (పెద్దవి) వ స్సఘాయిర్ (చిన్నవి). పెద్ద పాపాలలో మనిషి చాలా రకాలుగా పాపాలు చేస్తాడు. అన్యాయం, మోసం, వ్యభిచారం, దగా, ద్రోహం, హత్య, దొంగతనం, సారాయి, జూదం ఇలాంటి ఎన్నో రకరకాల పాపాలు చేస్తాడు.
కాకపోతే, ఈ పాపాలలో అన్నింటికంటే, అతి పెద్ద పాపం, అది బహుదైవారాధన. పెద్ద షిర్క్ చేయటం. ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేయటం.
ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా సూరతున్ నిసాలో తెలియజేశారు.
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ (ఇన్నల్లాహ లా యఘ్ ఫిరు అన్ యుష్రక బిహీ వ యఘ్ ఫిరు మా దూన జాలిక లిమన్ యషా)
“తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.” (4:48)
నిస్సందేహంగా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించనిది కేవలం అది షిర్క్, బహుదైవారాధన. బహుదైవారాధనను, షిర్కును అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించడు. అది తప్ప ఏ పాపాన్నయినా తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు.
అభిమాన సోదరులారా, ఓ సందర్భంలో అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దర్యాప్తు చేయడం జరిగింది.
أَىُّ الذَّنْبِ أَعْظَمُ عِنْدَ اللَّهِ؟ (అయ్యు జ్జంబి అ’అజము ఇందల్లాహ్?) ఓ ప్రవక్తా, ఏ పాపం అల్లాహ్ వద్ద అన్నింటికంటే పెద్దది?
అతి పెద్ద పాపం అల్లాహ్ దగ్గర ఏది? ఈ ప్రశ్నకి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు.
أَنْ تَجْعَلَ لِلَّهِ نِدًّا وَهْوَ خَلَقَكَ (అన్ తజ్ అల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక) నిన్ను సృష్టించిన అల్లాహ్ కు వేరొకరిని సాటి కల్పించటం.
అల్లాహ్ కు భాగస్వాములుగా చేయటం, వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టించాడు. అంటే షిర్క్ చేయటం అల్లాహ్ వద్ద అన్నింటికంటే ఘోరమైన పాపం, పెద్ద పాపం అని ఈ హదీస్ మరియు ఆయత్ ద్వారా మనకు అర్థమయింది.
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరినీ షిర్క్ నుండి రక్షించు గాక, కాపాడు గాక. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించు గాక. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
సేకరణ మరియు కూర్పు:ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ ఉర్దూ పరిశీలన:షేక్ మక్సూద్ ఉల్ హసన్ ఫైజీ – అల్-గాత్,సౌదీ అరేబియా తెలుగు పరిశీలన: అబ్దుస్ సమీ, దాయి వ ముబల్లిగ్ రాజమండ్రి [డౌన్లోడ్ PDF] [4 పేజీలు]
الحمد لله، والصلاة والسلام على رسول الله. أما بعد!
ఇస్రా మరియు మేరాజ్ సంఘటన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలో ఒక క్లిష్ట సమయంలో జరిగింది, ఆ సమయంలో ఆయనపై దుఃఖం యొక్క పెద్ద భారం ఉంది. ఇస్లాం ఆహ్వానం (దావత్) ప్రారంభించి పదేళ్లు గడిచాయి, కానీ ముష్రిక్కుల (బహుదైవారాధకుల) వ్యతిరేకత తగ్గడానికి బదులు మరింత పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఆయన పెదనాన్న అబూ తాలిబ్ మరియు భార్య హజ్రత్ ఖదీజా (రజియల్లాహు అన్హా) మరణం తర్వాత ముష్రిక్కులకు మరింత స్వేచ్ఛ దొరికినట్లయింది. ప్రవక్త గారు ఆశతో తాయిఫ్ వైపు వెళ్ళారు, కానీ అక్కడ కూడా ఆయనకు బాధలే ఎదురయ్యాయి. చివరికి ఒక ముష్రిక్ పెద్ద (ముత్ఇమ్ బిన్ అది) ఆశ్రయం పొంది మక్కాలోకి ప్రవేశించారు. దీని తర్వాతే అల్లాహ్ తరపున ఈ ఆహ్వానం (మేరాజ్) వచ్చింది. ఇందులో ఒకవైపు ఆయనకు అల్లాహ్ యొక్క అద్భుత నిదర్శనాలను చూపించడం జరిగితే, మరోవైపు ఆయనకు ఓదార్పు మరియు ప్రశాంతతను ఇస్తూ – “లోకంలోని వారు మిమ్మల్ని గుర్తించకపోయినా పర్వాలేదు, ఆకాశవాసుల దృష్టిలో మీ స్థానం ఏమిటో చూడండి” అని తెలియజేయడం జరిగింది.
రండి, సంక్షిప్తంగా ఆయనకు చూపించబడిన ఆ అద్భుతాలను చూద్దాం:
[1] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి వక్షస్థలం చీల్చి (షఖ్ఖె సద్ర్), గుండెకు శస్త్రచికిత్స చేసి, దానిని ఈమాన్ (విశ్వాసం) మరియు హిక్మత్ (జ్ఞానం)తో నింపడం. [బుఖారీ: 3887]
[2] గాడిద కంటే పెద్దది, కంచర గాడిద కంటే చిన్నది అయిన తెల్లని జంతువు ‘బురాక్‘పై ప్రయాణించడం. దాని అడుగు అది చూసే చివరి చూపు మేర పడేది. [బుఖారీ: 3887]
[3] రాత్రి యొక్క అత్యంత తక్కువ సమయంలో మస్జిదె హరామ్ నుండి మస్జిదె అఖ్సా వరకు, అక్కడ నుండి ఏడు ఆకాశాలకు మరియు స్వర్గ-నరకాల దర్శనం చేసి తిరిగి మక్కాకు చేరుకోవడం.
[5] వివిధ ఆకాశాలలో వివిధ ప్రవక్తలను కలవడం. [బుఖారీ: 3887]
ఏయే ఆకాశంలో ఎవరిని కలిశారంటే: మొదటి ఆకాశం: హజ్రత్ ఆదమ్ (అలైహిస్సలాం) రెండో ఆకాశం: హజ్రత్ ఈసా మరియు యహ్యా(అలైహిస్సలాం) మూడో ఆకాశం: హజ్రత్ యూసుఫ్ (అలైహిస్సలాం) నాలుగో ఆకాశం: హజ్రత్ ఇద్రీస్ (అలైహిస్సలాం) ఐదో ఆకాశం: హజ్రత్ హారూన్ (అలైహిస్సలాం) ఆరో ఆకాశం: హజ్రత్ మూసా (అలైహిస్సలాం) ఏడో ఆకాశం: హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం)
[6] ‘సిద్రతుల్ ముంతహా‘ (చిట్టచివరి బేరి చెట్టు) వరకు చేరుకోవడం. దాని పండ్లు హజర్ ప్రాంతపు పెద్ద మట్టి కుండలంత పెద్దవిగా, ఆకులు ఏనుగు చెవులంత ఉన్నాయి. దాని వేర్లు ఆరో ఆకాశంలో, పై కొమ్మలు ఏడో ఆకాశం వరకు ఉన్నాయి. ఇది అనేక అద్భుతాలకు కేంద్రం:
1) ‘జన్నతుల్ మఅవా‘ (నివాస స్వర్గం) దీనికి దగ్గరలోనే ఉంది) 2) అదే చోట కలాల (కలంతో రాసే) శబ్దం వినిపిస్తుంది. 3) అదే స్థానంలో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు మూడు కానుకలు లభించాయి: – ఐదు పూటల నమాజుల కానుక. – సూరహ్ అల్-బఖరాలోని చివరి రెండు ఆయతులు. – ప్రవక్త గారి ఉమ్మత్ (అనుచరుల)లో ఎవరైతే షిర్క్ (బహుదైవారాధన) చేయరో, వారి ఘోర పాపాలు (కబీరా గునాహ్) క్షమించబడతాయనే శుభవార్త. [ముస్లిం: 173] 4) హజ్రత్ జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను ఇక్కడ ఆయన అసలు రూపంలో రెండోసారి చూశారు. 5) ఇక్కడ నాలుగు నదులను చూశారు, వాటి ఊటలు అక్కడే ఉన్నాయి. [బుఖారీ: 3887] 6) మద్యం, పాలు మరియు తేనె పాత్రలు సమర్పించగా, ప్రవక్త గారు పాల పాత్రను స్వీకరించారు. [బుఖారీ: 3887]
[7] బైతుల్ మామూర్‘ను చూశారు. ప్రతిరోజూ డెబ్భై వేల మంది మలైకా (దేవదూతలు) అందులో నమాజు చేస్తారు [తవాఫ్ చేస్తారు]. [బుఖారీ: 3207]
[8] హజ్రత్ మూసా (అలైహిస్సలాం)ను చూశారు – ఆయన గోధుమ రంగు, పొడవైన శరీరం మరియు ఉంగరాల జుట్టు కలిగి ఉన్నారు. హజ్రత్ ఈసా (అలైహిస్సలాం)ను చూశారు – ఆయన మధ్యస్థ ఎత్తు, మధ్యస్థ శరీరం, ఎరుపు మరియు తెలుపు కలసిన రంగు, మరియు తిన్నని జుట్టు కలిగి ఉన్నారు. నరక ద్వార పాలకుడు ‘మాలిక్‘ను చూశారు, అతను సలాం చేశాడు. అలాగే దజ్జాల్ను కూడా చూశారు. [బుఖారీ: 3239, ముస్లిం: 165, 172]
[9] స్వర్గాన్ని పరిశీలించారు. అందులో ముత్యాల గుమ్మటాలు ఉన్నాయి మరియు దాని మట్టి కస్తూరిలా (సువాసనతో) ఉంది. [బుఖారీ: 349,ముస్లిం:163]
[11] దైవదూతల ఏ సమూహం మీదుగా వెళ్ళినా, వారందరూ – “ఓ ముహమ్మద్! మీ ఉమ్మత్కు ‘హిజామా‘ (కప్పింగ్ థెరపీ) చేయించుకోమని ఆజ్ఞాపించండి” అని చెప్పారు. [ఇబ్న్ మాజా: 3479,సహీహా: 2263]
[12] ఫిరౌన్ పనిమనిషి (కేశాలంకరిణి) మరియు ఆమె భర్త, పిల్లల గొప్ప ముగింపును కూడా చూశారు (వారిని ఫిరౌన్ చంపించివేశాడు). [ముస్నద్ అహ్మద్: 5/30]
[13] ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) జిబ్రయీల్ (అలైహిస్సలాం)ను మరొక రూపంలో చూశారు: ఆయన అల్లాహ్ భయంతో పాతబడిన గొంగళిలా (శిథిలమైన వస్త్రంలా) వణికిపోతున్నారు. [సహీహా: 2289]
[14] హజ్రత్ ఇబ్రహీం (అలైహిస్సలాం) ముహమ్మద్ ఉమ్మత్కు పంపిన ప్రత్యేక సందేశం: “ఓ ముహమ్మద్! మీ ఉమ్మత్కు నా తరపున సలాం చెప్పండి. స్వర్గపు మట్టి ఎంతో సారవంతమైనదని, నీరు తీపిగా ఉంటుందని, కానీ అది మైదానంలా (ఖాళీగా) ఉంటుందని, అందులో తోటలు పెంచడానికి ‘సుబ్ హానల్లాహ్, అల్ హందులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్‘ అనేవి విత్తనాలు (చెట్లు) అని తెలియజేయండి.” [తిర్మిజీ, హసన్ అల్-అల్బానీ:3462]
[15] మరో రివాయత్ (ఉల్లేఖనం) ప్రకారం – మీ ఉమ్మత్తో చెప్పండి, వారు స్వర్గంలో ఎక్కువ మొక్కలు నాటుకోవాలని, ఎందుకంటే అక్కడి మట్టి ఎంతో శ్రేష్ఠమైనది మరియు భూమి విశాలమైనది. ప్రవక్త గారు స్వర్గపు మొక్కలు ఏమిటని అడగగా, ఇబ్రహీం (అలైహిస్సలాం) బదులిచ్చారు: ‘లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా‘. [ముస్నద్ అహ్మద్: 5/418,సహీహా: 105]
[16] రాగి గోర్లు కలిగిన కొంతమంది మనుషులు తమ ముఖాలను, వక్షాలను గీక్కుంటున్నారు. వారి గురించి జిబ్రయీల్ (అలైహిస్సలాం) వివరిస్తూ – “వీరు ప్రజల మాంసాన్ని తినేవారు (అంటే చాడీలు చెప్పేవారు, పరోక్షనింద చేసేవారు) మరియు ప్రజల గౌరవానికి భంగం కలిగించేవారు” అని చెప్పారు. [అబూ దావూద్: 4878]
[17] కొంతమంది పెదవులను అగ్ని కత్తెరలతో కత్తిరించడం జరుగుతుంది. వారు ఎవరని అడగ్గా – “వీరు మీ ఉమ్మత్కు చెందిన ప్రసంగీకులు (ఖతీబ్లు). వీరు ప్రజలకు మంచి విషయాలు చెబుతారు కానీ తాము మాత్రం పాటించరు, వీరు గ్రంథాన్ని చదువుతున్నా అర్థం చేసుకోరు” అని చెప్పబడింది. [షర్హుస్సున్నహ్: 4159,ముస్నద్ అహ్మద్, సహీహా: 291]
[18] హజ్రత్ అబూ బకర్ (రజియల్లాహు అన్హు)కు ‘సిద్దీఖ్‘ అనే బిరుదు రావడానికి ఈ మేరాజ్ సంఘటనే కారణమైంది. [సహీహా: 306]
[19] హజ్రత్ సాలిహ్ (అలైహిస్సలాం) గారి ఒంటెను చంపినవాడిని కూడా ప్రవక్త గారు నరకంలో చూశారు. (ముస్నద్ అహ్మద్)
పై సత్య విషయాలు అందరికీ తెలియజేయండి. బిద్అత్ మరియు అపోహాలను దూరం చేసి, అసలు ఇస్లాంను పెంపొందించండి.
మేరాజ్ (గగణ ప్రయాణ) దృశ్యాలు – నసీరుద్దీన్ జామియీ (హఫిజహుల్లాహ్) [వీడియో] ప్రవక్త మేరాజ్ (గగణ ప్రయాణాని)కి రజబ్ లోనే వెళ్ళారా? ఈ సందర్భంగా తర్వాత రోజుల్లో షబె మేరాజ్ జరుపుకున్నారా?
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
బిద్అత్ రకాలు – హబీబుర్రహ్మాన్ జామయి [వీడియో & టెక్స్ట్]
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
తఫ్సీర్ సూర అల్ ఆలా (Tafseer Sura Al A’ala) వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్) https://youtu.be/5shT_PdxwNE [60 నిముషాలు]
ఈ ప్రసంగంలో, సూరహ్ అల్-ఆ`లా యొక్క వివరణ ఇవ్వబడింది. అల్లాహ్ యొక్క పవిత్రతను కీర్తించడం (తస్బీహ్) నాలుగు విధాలుగా ఉంటుందని వివరించబడింది: హృదయంలో, మాటలో, అల్లాహ్ నామాలు మరియు గుణాల విషయంలో, మరియు ఆచరణలో. అల్లాహ్ యే సృష్టికర్త, సృష్టిని తీర్చిదిద్ది, ప్రతిదాని విధిని నిర్ధారించి, మార్గదర్శకత్వం ఇచ్చేవాడని నొక్కి చెప్పబడింది. ప్రాపంచిక జీవితం తాత్కాలికమని, పచ్చిక బయళ్ళు ఎండిపోయినట్లు మానవ జీవితం కూడా ముగుస్తుందని, కానీ అల్లాహ్ పునరుత్థానం చేస్తాడని గుర్తుచేయబడింది. ఖుర్ఆన్ ను ప్రవక్త (స)కు అల్లాహ్ యే గుర్తుంచుకునేలా చేస్తాడని, దానిని అనుసరించడం సులభతరం చేయబడిందని చెప్పబడింది. అల్లాహ్ కు భయపడేవారే ఉపదేశాన్ని స్వీకరిస్తారని, దౌర్భాగ్యులు దానిని తిరస్కరించి ఘోరమైన నరకాగ్నిలో ప్రవేశిస్తారని హెచ్చరించబడింది. ఆత్మశుద్ధి చేసుకుని, అల్లాహ్ ను స్మరించి, నమాజ్ చేసేవారే సాఫల్యం పొందుతారని. ప్రాపంచిక జీవితం కంటే పరలోక జీవితమే శ్రేష్ఠమైనదని, శాశ్వతమైనదని, ఈ సందేశం ఇబ్రాహీం (అ.స) మరియు మూసా (అ.స) గ్రంథాలలో కూడా ఉందని సూరహ్ ముగుస్తుంది. ప్రసంగం తర్వాత, ఇషా నమాజ్ సమయం, ఉదూ లేకుండా ఖుర్ఆన్ పట్టుకోవడం, మరియు షిర్క్ కు సంబంధించిన ఆచారాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడ్డాయి.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబీయ్యినా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసహ్బిహీ అజ్మయీన్ అమ్మా బాద్.
ప్రియ విద్యార్థులారా, ఈరోజు మనం అల్లాహ్ యొక్క దయతో సూరతుల్ ఆలా యొక్క తఫ్సీర్ ప్రారంభించబోతున్నాము. అయితే ఈ సూరకు సంబంధించి కొన్ని ప్రారంభ విషయాలు నేను ఇంతకుముందు క్లాస్ లో చెప్పి ఉన్నాను.
‘సబ్బిహ్’ – పవిత్రతను కొనియాడు, ‘సుబ్ హా నల్లాహ్’ అని పలుకుతూ ఉండు. దీని యొక్క భావం ఇంతకు ముందే నేను చెప్పాను, నాలుగు రకాలుగా ఉండాలి. మనం అల్లాహ్ యొక్క తస్బీహ్ నాలుగు రకాలుగా చేయాలి.
(1) ఒకటి, మన మనస్సులో అల్లాహ్ అన్ని రకాల షిర్క్, అన్ని రకాల లోపాలు, అన్ని రకాల దోషాలకు అతీతుడు అని బలంగా నమ్మాలి.
(2) మరియు ‘సుబ్ హా నల్లాహ్’ అని నోటితో పలుకుతూ ఉండాలి.
(3) మూడవది, అల్లాహ్ యొక్క ఉత్తమ నామాలు, అల్లాహ్ యొక్క మంచి గుణాలు అవి అల్లాహ్ కు మాత్రమే తగును, అందులో అల్లాహు త’ఆలా ఎలాంటి లోపాలు లేనివాడు అని కూడా స్పష్టంగా నమ్మాలి.
(4) ఇంకా, మన ఆచరణ ద్వారా అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి. అంటే, మనం ఏ పని చేయడం ద్వారా మనం అల్లాహ్ కు ఒక దోషాన్ని అంటగట్టిన వారం అవుతామో, అలాంటి పనులు చేయకూడదు. అల్లాహ్ అన్ని రకాల దోషాలకు, లోపాలకు అతీతుడు అని స్పష్టమయ్యే అటువంటి పనులు మనం చేయాలి. అంటే అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చాటాలి మన యొక్క ఆచరణ ద్వారా కూడా.
ఒక చిన్న ఉదాహరణ చూడండి , మీకు విషయం అర్ధం అవుతుంది . మనం భారతీయులము గనక 15వ ఆగస్టు, 26 జనవరి ఇలాంటి సందర్భంలో మనం మన దేశ దేశానికి ఏదైతే స్వాతంత్రం లభించినదో, దానిని పురస్కరించుకొని ఒక సంబరం, ఒక సంతోషం వ్యక్తపరుస్తాము. కానీ మన తోటి భారతీయులు కొందరు ఏం చేస్తారు? ఆ సమయంలో అక్కడ నెహ్రూ గారి లేదా గాంధీ గారి యొక్క బొమ్మలు పెట్టి అక్కడ కొబ్బరికాయ కొడతారు. అయితే ఈ సందర్భంలో మనం అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడాలి మన ఆచరణ ద్వారా. అయితే మనం, వారు అక్కడ టెంకాయ కొడుతున్నప్పుడు కేవలం ‘సుబ్ హా నల్లాహ్’ అనుకుంటే సరిపోదు. ఎప్పుడైతే ‘ఓ రండి, మీరు మా జమాత్ యొక్క పెద్ద, మీరు మా యొక్క స్కూల్ కు పెద్ద ఆర్గనైజర్, మీరు పెద్ద హెడ్ మాస్టర్’ ఈ విధంగా ఎవరైనా ఒక ముస్లింని ఆహ్వానించి ముందుకు తీసుకొచ్చి అతని చేతిలో ఓ టెంకాయ ఇచ్చి ‘కొట్టండి’ అని అంటే అక్కడ అతని యొక్క పరీక్ష. అతడు అల్లాహ్ కు కాకుండా వేరే వారికి ఈ టెంకాయ కొట్టి టెంకాయ సమర్పించినవాడు అవుతున్నాడు. అంటే అతను ‘సుబ్ హా నల్లాహ్’ నోటితో పలుకుతున్నా, ఆచరణతో వ్యతిరేకిస్తున్నాడు అని భావం. ఇప్పుడు అర్థమైందా అందరికీ క్లియర్ గా? మనం అల్లాహ్ యొక్క అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా మనం ఎలా కొనియాడాలి అన్న విషయం తెలిసింది కదా?
ఇక ‘రబ్బిక’ నీ ప్రభువు అన్నటువంటి పదం ఇక్కడ అల్లాహు త’ఆలా ఉపయోగించాడు. ‘సబ్బిహిల్లా’ అల్లాహ్ యొక్క పవిత్రత కొనియాడు అని అంటే కూడా మాట వస్తుంది. కానీ ‘రబ్బిక’ అనడంలో ఇక్కడ హిక్మత్, ఔచిత్యం అని కొందరు ధర్మవేత్తలు, వ్యాఖ్యానకర్తలు ఏం తెలిపారంటే, ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో ఏ ముష్రికులు అయితే ఉండేవారో చుట్టుపక్కన మొత్తం, వారు మనందరి సృష్టికర్త అయిన నిజమైన ప్రభువు అల్లాహ్ ను రబ్ అని, అల్లాహ్ ను ఖాలిఖ్ పుట్టించేవాడని, అల్లాహ్ ను రాజిఖ్ ఉపాధి ప్రదాత అని నమ్మేవారు. అయినా షిర్క్ చేసేవారు. అయితే ఇలాంటి వారికి మరీ నొక్కి చెప్పడం జరుగుతుంది. మీరు ఏ అల్లాహ్ నైతే ప్రభువు అని నమ్ముతున్నారో, ఆ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడండి. షిర్క్ కు దూరంగా ఉండిపోండి.
‘అల్-ఆలా’ అల్లాహ్ యొక్క పేరు కూడా మరియు ఇందులో అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ ఉన్నతుడు అందుకొరకే ఇక్కడ అనువాదంలో ఉంది ‘సర్వోన్నతుడు’ అయిన. అల్లాహు త’ఆలా తన యొక్క అస్తిత్వం జాత్ కే ఏతిబార్ సే, తన యొక్క ఉత్తమ నామాలు, మంచి గుణాల విషయంలో కూడా సర్వోన్నతుడు. తన యొక్క పనులలో కూడా సర్వోన్నతుడు.
సూరహ్ అల్-ఆ`లా – 2 నుండి 5 ఆయతులు
ఈ మొదటి ఆయతులో రబ్ అంటే ఏంటి, ఆ`లా అంటే ఏంటి, తస్బీహ్ అంటే ఏంటి, ఇవన్నీ వివరాలు మనం తెలుసుకున్నాము. అయితే అల్లాహ్ యొక్క, నీ ప్రభువు యొక్క పవిత్రతను కొనియాడు. ఎందుకు పవిత్రతను కొనియాడాలి? మన యొక్క ‘సుబ్ హా నల్లాహ్’ అనడానికి తస్బీహ్ కి అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే ఎందుకు? ఇక్కడ అల్లాహు త’ఆలా ఆయతు నెంబర్ రెండు నుండి ఆయతు నెంబర్ ఐదు వరకు కొన్ని కారణాలు తెలుపుతున్నాడు. శ్రద్ధ వహించండి ఇప్పుడు.
وَالَّذِي قَدَّرَ فَهَدَىٰ (వల్లదీ ఖద్దర ఫహదా) ఆయనే (కావలసిన వాటిని తగురీతిలో) నిర్ధారించాడు. పిదప మార్గం చూపించాడు. (87:3)
ఆయనే సృష్టించాడు. ‘ఫసవ్వా’ మరి ఆపైన తీర్చిదిద్దాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అంతేకాదు, ఆ అల్లాహు త’ఆలా, ‘వల్లదీ ఖద్దర’ ఆయనే కావలసిన వాటిని తగు రీతిలో నిర్ధారించాడు. ‘తఖ్దీర్’ విధిరాత అని ఏదైతే అంటామో, దాని యొక్క ప్రస్తావన కూడా ఈ ‘ఖద్దర’ అన్న పదంలోనే వచ్చేస్తుంది. ‘ఫహదా’ పిదప మార్గం చూపించాడు.
నాలుగు పదాలు ఇక్కడ చూస్తున్నారు కదా. ఖలక, సవ్వా, ఖద్దర, హదా. ప్రియ విద్యార్థులారా, ఈ నాలుగు పదాల యొక్క అర్థమైతే ఇక్కడ ఉన్నది. ఖలక సృష్టించాడు, సవ్వా తీర్చిదిద్దాడు, ఖద్దర నిర్ధారించాడు, తఖ్దీర్ విధిరాత రాశాడు, హదా మార్గం చూపించాడు. కానీ వ్యాఖ్యానకర్తలు దీని గురించి చెప్పిన విషయాలను గమనిస్తే, అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క గొప్పతనం మన ముందు ఎంత స్పష్టంగా వస్తుందో, మీరు ఒకసారి గమనించాలి ఈ విషయాన్ని.
ఖుర్ఆన్ లో ఇంకా అనేక సందర్భాల్లో వీటి యొక్క కొన్ని ఉదాహరణలు కూడా తెలుపబడ్డాయి. వీటి యొక్క ఈ నాలుగు పదాలు ఇక్కడ ఏవైతే వచ్చి ఉన్నాయో, వాటి యొక్క కొన్ని ఉదాహరణలు ఖుర్ఆన్ లోని వేరే సూరత్ లో. ఇంతకు ముందు మీరు ఉదాహరణకు చదివారు కదా సూరతుల్ ఇన్ఫితార్ లో? ఆయతు నెంబర్ ఏడులో.
يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ (యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీమ్) ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది?(82:6)
الَّذِي خَلَقَكَ فَسَوَّاكَ فَعَدَلَكَ (అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్) (యదార్థానికి) ఆయనే నిన్ను పుట్టించాడు, నిన్ను చక్కగా తీర్చిదిద్దాడు, ఆపైన నిన్ను తగు రీతిలో పొందికగా మలిచాడు. (82:7)
فِي أَيِّ صُورَةٍ مَّا شَاءَ رَكَّبَكَ (ఫీ అయి సూరతిమ్ మాషాఅ రక్కబక్) తాను కోరిన ఆకారంలో నిన్ను కూర్చాడు.(82:8)
గుర్తొచ్చిందా? అక్కడ చూడండి, సూరతుల్ ఇన్ఫితార్ లో మనం చదివి ఉన్నాము. అలాగే మీరు గమనించారంటే, సూరత్ అత్-తీన్ అని అంటాము కదా మనం? అక్కడ, అలాగే సూరత్ అస్-సజ్దాలో కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాలను వివరించాడు.
సంక్షిప్తంగా, సారాంశంగా మనం చెప్పుకోవాలంటే, ఉదాహరణకు ఒక మనిషి విషయమే చూడండి. అల్లాహు త’ఆలా ఇక్కడ పూర్తి సృష్టి విషయం గురించి చెబుతున్నాడు. ఖలక అంటే అల్లాహు త’ఆలా పూర్తి సృష్టిని సృష్టించాడు. సవ్వా, ప్రతీ సృష్టిలో వారికి ఎలాంటి చక్కబాటు, తీర్చిదిద్దడం అవసరమో ఆ రీతిలో తీర్చిదిద్దాడు. ఖద్దర, ప్రతి ఒక్కరి విధిరాత రాసి ఉంచాడు. హదా, ప్రతి ఒక్కరికీ వారికి అవసరమైనది వారికి మార్గం చూపాడు.
కానీ ఈ విషయం కొంచెం వివరంగా ఒక్క మానవుని విషయంలోనే మనం గమనించామంటే, అల్లాహు త’ఆలా మానవుని సృష్టించాడు కదా. చూడండి ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఈ కళ్ళు మనకు వెనక వైపున ఉంటే? మన ఈ మూతి, ఫేస్ అనడం లేదు నేను, మౌత్ అని ఏదైతే అంటామో మూతి, ఇందులో నుండి అయితే పళ్ళు ఉన్నాయి, పెదవులు ఉన్నాయి, ఇది మన ఏదైనా ఒక వైపున ఉండేది ఉంటే? అలా కాకుండా కేవలం మనిషి ఒక తిండి విషయం ఆలోచించండి. మనిషి తినాలి. మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ద్వారా మంచి శక్తి లభిస్తుంది, మంచి శక్తి లభిస్తే మంచిగా అల్లాహ్ ను ఆరాధించగలుగుతాడు.
ఉదాహరణకు ఒకటి తీసుకోండి. తినడానికి తన చేతిలో ఒక అన్నం ముద్దనే ఎత్తాడు అనుకోండి. చేతుల ద్వారా ముందు విషయం తెలుస్తుంది. ఆ అన్నం మెత్తగా ఉన్నదా, పాసిపోయినదా, మంచిగా ఉన్నదా, గట్టిగా ఉన్నదా? బియ్యం ఏవైతే మనం వండామో, అవి మంచిగా ఉడికాయా లేవా అన్న విషయాలు మనకు మన వేళ్ళ ద్వారా తెలుస్తుంది కదా. దానితోపాటు ఏదైనా కూర కలుపుకొని ముద్ద చేసుకొని మనం పైకి ఎత్తుతాము. అందులో ఏదైనా మనకు ఇష్టం లేని మిరపకాయ వచ్చినా కళ్ళతో కనబడుతుంది, పక్కకు తీసేస్తాము. ఒకవేళ అందులో ఏదైనా మనకు ఇష్టం లేని వాసన లాంటిది ఉండేది ఉంటే, ముక్కు కాడికి వచ్చేసరికి పక్కకు జరిపేస్తాము. ముక్కుతో మనం అది పీల్చి చూస్తాము గనక. అంతా కూడా బాగానే ఉంది అని పెదవుల వరకు తెచ్చి ఇలా నోట్లో పెడతాము. అంతలోనే నాలుక నోట్లో ఇలా పెట్టిన వెంటనే నాలుక దాని యొక్క రుచి చెబుతుంది. ఓ ఛీ ఛీ, ఇంత ఎక్కువ ఉప్పు అయిపోయిందా! కదా, నేను ఎలా నా కడుపులో దించాలి? లేదా ఇంకా వేరే ఏదైనా. అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాను నేను. ఈ విధంగా మీరు గమనించండి, అల్లాహు త’ఆలా మనకు ఎన్ని రకాల ఈ తీర్చిదిద్దడం అనే విషయంలోనే ఒక కేవలం మన శరీరంలోనే చూసుకుంటే, మళ్ళీ ఆ తర్వాత ఆ అన్నం ముద్ద మన గొంతు కిందికి దిగడానికి గొంతులో ఎలాంటి ప్రక్రియ ఉన్నది? అక్కడి నుండి మళ్ళీ కిందికి ఎప్పుడైతే వస్తుందో, జీర్ణాశయంలో వెళ్ళే వరకు మధ్యలో ఇంకా ఎక్కడెక్కడ మన యొక్క ఊపిరితిత్తులకు సంబంధించినవి, మన యొక్క లివర్ కార్యానికి సంబంధించినవి, ఈ విధంగా మీరు చూసుకోండి, ప్రతి ఒక్కటి ఎలా పనిచేస్తుంది? ఒక్కసారి మనం ఒక అన్నం ముద్ద లోపటికి వేస్తే, మన శరీరంలోని ఏ లోపలి, బయటి ఏ ఏ అవయవాలు ఏ రీతిలో పనిచేస్తాయి, ఒక పొందికగా, ఒక మంచి రీతిలో? అల్లాహు అక్బర్. నిజంగా చాలా ఆశ్చర్యపోతారు. అందుకొరకే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఒక చోట ఏమంటున్నాడు? ‘వఫీ అన్ఫుసికుం అఫలా తుబ్సిరూన్’ ఏమిటి మీరు మీ యొక్క స్వయం మీ శరీరంలోనే గమనించరా? అల్లాహ్ యొక్క సృష్టి ప్రక్రియను మీరు గ్రహించండి.
ఖద్దరతఖ్దీర్ విషయం కూడా ఉన్నది, మరియు మనిషికి ఏ ఏ అవసరాలు ఏ రీతిలో నిర్ధారించాడో అల్లాహు త’ఆలా నిర్ధారించాడు. మనం మనుషులము గనుక నేను మనిషి యొక్క ఉదాహరణ ముందుగా చెబుతున్నాను, వేరే ఇంకా సృష్టిరాశుల గురించి చెప్పుకుంటూ వెళ్తే మరి ఈ రెండు ఆయతుల్లోనే ఇంకా గంటల తరబడి సమయం వెళ్ళిపోతుంది.
హదా, ప్రతి ఒక్కరికీ వారి యొక్క హిదాయత్, ఇహలోకంలో వారు ఏ రీతిలో మంచిగా జీవించాలి, పరలోకంలో స్వర్గం పొందాలంటే ఏం చేయాలి, ఇవన్నీ విషయాల యొక్క మార్గదర్శకత్వం కూడా అల్లాహు త’ఆలా చేశాడు. అల్లాహ్ ఈ నాలుగు పనులు చేసిన వాడు కనుక మీరు ఈ అల్లాహ్ యొక్క తస్బీహ్ చేయాలి, ఇంకా వేరే ఎవరి తస్బీహ్ చేయకూడదు. అంతేకాదు,
وَالَّذِي أَخْرَجَ الْمَرْعَىٰ (వల్లదీ అఖ్రజల్ మర్ఆ`) మరియు ఆయనే పచ్చిక బయళ్ళను ఉత్పన్నం చేశాడు.
فَجَعَلَهُ غُثَاءً أَحْوَىٰ ఆపైన వాటిని నల్లని చెత్తకుప్పగా చేసేశాడు.
ఎందుకు? మీతో పాటు మీ జంతువులు కూడా, మీరు ఎలాగైతే అల్లాహ్ యొక్క అనుగ్రహాలను అనుభవిస్తూ తింటూ త్రాగుతూ హాయిగా ఉన్నారో, మీ సేవకు ఉన్న వేరే జంతువుల కొరకు కూడా అల్లాహు త’ఆలా ఆహారాన్ని పుట్టించాడు. కానీ ఈ పచ్చిక బయళ్ళు మనం ఏవైతే చూస్తామో, స్వయం మన కొరకు ఆహారంగా ఉన్నటువంటి ఈ పంటల విషయం మీరు ఒకసారి చూడండి. బియ్యమైనా, వేరే కూరగాయలైనా, వేరే పప్పు దినుసులైనా, ఇవన్నీ ఏ పచ్చని పైర్ల ద్వారా మనకు లభిస్తాయో, వాటి నుండి మనం ఆ ధాన్యాలు తీసుకున్న వెంటనే, ఆ తర్వాత అది గడ్డిగా అయిపోతుంది కదా? ఆ తర్వాత మళ్ళీ మిగిలినది కూడా నల్లగా అయిపోయి, అక్కడ ఏమైనా ఇంతకుముందు పండిందో లేదో అన్నటువంటి పరిస్థితి ఆ భూమిది అయిపోతుంది.
అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు? ఈ విషయాన్ని అల్లాహ్ ఇక్కడ ఎందుకు తెలుపుతున్నాడు అంటే, ఓ మానవులారా, ఏ రీతిలోనైతే మీరు ఈ పంటలు చూస్తారో, అలాగే మీ యొక్క పరిస్థితి. మీ ఏ నామ నిషాన్, మీ యొక్క ఏ గుర్తు లేకుండా ఉండినది, కానీ మీ తల్లిదండ్రుల ద్వారా అల్లాహ్ మిమ్మల్ని పుట్టించాడు. మీరు పెరిగారు, మళ్ళీ చనిపోతారు. చనిపోయిన తర్వాత, ఎలాగైతే ఈ భూమి మొత్తం ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చినుకులు పడడం ద్వారా ఇక్కడ పచ్చిక బయళ్ళు మనకు కనబడుతున్నాయో, అదే రీతిలో మిమ్మల్ని కూడా అల్లాహు త’ఆలా మరోసారి తప్పకుండా పుట్టిస్తాడు. మరోసారి మిమ్మల్ని అల్లాహ్ పుట్టించడంలో ఎలాంటి సందేహం, ఎలాంటి అనుమానం లేదు. గమనిస్తున్నారా? అందుకొరకే ఈ లాంటి ఈ శక్తి గల అల్లాహ్ ను మాత్రమే మీరు ఆరాధించాలి. ఆయన యొక్క పవిత్రత మాత్రమే మీరు కొనియాడాలి. మరియు మీరు ఆ అల్లాహ్ తప్ప ఇంకా వేరే ఎవరినీ ఆరాధించకూడదు. మరియు ఆ అల్లాహ్ తొలిసారి మిమ్మల్ని పుట్టించినట్లుగా, మలిసారి పుట్టించే శక్తి గలవాడు అని కూడా నమ్మాలి.
సూరహ్ అల్-ఆ`లా – 6 నుండి 9 ఆయతులు
ఇక ఆ తర్వాత రండి. ఇహలోకంలో పుట్టించి అన్ని రకాల మార్గాలు మీకు సులభం చేసిన ఈ అల్లాహు త’ఆలా, చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ పుట్టిస్తాడు కదా? అయితే మీ హృదయాలలో విశ్వాసం యొక్క మొలక నాటడానికి, సత్కార్యాల పట్ల పుణ్యం, పుణ్యం యొక్క ప్రేమ కలిగించడానికి, అల్లాహ్ మీ హిదాయత్ కొరకు ఖుర్ఆన్ అవతరింపజేశాడు. అయితే దాని విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాడు అల్లాహు త’ఆలా.
سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰ (సనుఖ్రిఉక ఫలా తన్సా) (ఓ ప్రవక్తా!) మేము నిన్ను చదివిస్తాము – మరి నువ్వు దానిని మరువలేవు. (87:6)
إِلَّا مَا شَاءَ اللَّهُ ۚ إِنَّهُ يَعْلَمُ الْجَهْرَ وَمَا يَخْفَىٰ (ఇల్లా మాషా అల్లాహ్, ఇన్నహూ యఅ`లముల్ జహ్ర వమా యఖ్ఫా) అయితే అల్లాహ్ తలచినది మాత్రం (మరువగలవు). ఆయన బహిర్గతమయ్యే దానినీ, గోప్యంగా ఉన్నదానినీ ఎరిగినవాడు. (87:7)
وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ (వనుయస్సిరుక లిల్ యుస్రా) (ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.(87:8)
ఈ మూడు ఆయతులు గుర్తున్నాయి కదా? శ్రద్ధగా వినండి. ఈ మూడు ఆయతుల యొక్క భావాన్ని, ఈ మూడు ఆయతుల యొక్క అనువాదం, ఈ మూడు ఆయతుల యొక్క సంక్షిప్త వ్యాఖ్యానాన్ని.
ఇందులో స్పష్టమైన మనకు అనువాదంలో కనబడుతున్న రీతిలో మనం చూస్తే, ఎలాంటి అనుమానం లేకుండా ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏంటి? ఖుర్ఆన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరిస్తున్నప్పుడు, శ్రద్ధ వినండి, అర్థం చేసుకోండి. ఈ మూడు ఆయతుల భావాలు ఏవైతే ఉన్నాయో, అందులో రెండు మాటలు నేను తెలియజేస్తున్నాను కనుక మీరు శ్రద్ధగా వింటే మాట మంచిగా అర్థమవుతుంది. ఆయతు నెంబర్ ఆరు, ఏడు, ఎనిమిది. ఇక్కడ అరబీ ఆయతులకు తెలుగు అనువాదం ఏదైతే ఉందో, దాని ప్రకారంగా బాహ్యమైన అర్థం ఒకటి ఏమిటి?
“మేము నిన్ను చదివిస్తాము మరి నువ్వు మరువలేవు. అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. ఆయన బహిర్గతమయ్యే దానిని, గోప్యంగా ఉన్న దానిని ఎరిగిన వాడు. మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.
దీని యొక్క బాహ్యమైన అర్థం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఖుర్ఆన్ అవతరిస్తున్న సందర్భంలో, నాకు అల్లాహ్ ఈ ఖుర్ఆన్ ఏదైతే ప్రసాదిస్తున్నాడో, నేను మరువకూడదు, నేను ఎల్లవేళల్లో నేను బ్రతికి ఉన్నంతవరకు నాకు ఈ ఆయతులు కంఠస్థం ఉండడానికి నేను మంచిగా గుర్తు చేసుకోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట వెంటనే చదువుతూ ఉండేవారు. దీని ప్రస్తావన మనకు ఇక్కడ ఏదైతే సూరతుల్ ఆ`లాలో చూస్తున్నారో, అదే కాకుండా మనకు సూరతుల్ ఖియామాలో కూడా కనబడుతుంది ఈ విషయం. మరియు అలాగే ఖుర్ఆన్ లో మరొకచోట కూడా అల్లాహు త’ఆలా ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశాడు, బహుశా సూరతుల్ ఇస్రా అనుకుంటా. అయితే ఓ ప్రవక్తా, ఫలా తాజల్, మీరు తొందర పడకండి. ఈ ఖుర్ఆన్ ను నీవు మరిచిపోకుండా భద్రంగా మీ మనసులో ఉండే విధంగా మేము నీకు సహాయపడతాము. ఆ విషయంలో నిన్ను మీకు మేము మీకు సులభతరం ప్రసాదిస్తాము. కనుక మీరు ఎలాంటి చింత లేకుండా మీకు ఎప్పుడైతే ఈ ఖుర్ఆన్ వహీ చేయడం జరుగుతుందో అప్పుడు కేవలం శ్రద్ధగా వినండి అంతే. తర్వాత దాన్ని కంఠస్థం మీ మనసులో, మీ హృదయంలో చేసే విషయంలో మేమే నీకు తోడు పడతాము. మరి నీవు మెల్లగా చదివినా, బహిరంగంగా చదివినా అంతా కూడా అల్లాహ్ కు చాలా మంచిగా తెలుసు.
అయితే ఇక్కడ ఏడవ ఆయతు ప్రారంభంలో ఏముంది? అయితే అల్లాహ్ తలచినది మాత్రం మరువగలవు. అంటే ఏమిటి ఇది? అల్లాహ్ తలచినప్పుడు కొన్ని ఆయతులు లేదా వాటి భావాన్ని ఏదైతే రద్దు పరుస్తాడో, దాని ప్రస్తావన సూరతుల్ బఖరాలో కూడా వచ్చి ఉంది. ఆ భావం. అది అల్లాహ్ యొక్క ఇష్టం. మనం ఎందుకు అల్లాహ్ ఇలా చేస్తాడు అని అల్లాహ్ ను అడిగే హక్కు మనకు లేదు. ఉదాహరణకు, సూరతున్నూర్ లో మనకు హదీసుల ద్వారా తెలుస్తుంది, పెళ్లి అయిన వారు వ్యభిచారానికి పాల్పడితే వారిని రాళ్లు రువ్వి చంపాలి అన్నటువంటి ఆదేశం కూడా ఉండింది. అయితే దానికి సంబంధించిన ఆ ఆయతులు కూడా ఉండినవి. అల్లాహు త’ఆలా ఆదేశాన్ని మిగిలి ఉంచాడు హదీసుల ద్వారా. కానీ ఆ ఆయతులు అల్లాహు త’ఆలా ఖుర్ఆన్ లో నుండి తీసేసాడు. అది అల్లాహ్ ఇష్టం.
ఇక సూర బఖరాలో ఉంది అల్లాహ్ తలచుకున్నప్పుడు ఆయతులలో రద్దు చేస్తాడు అన్నది విషయం, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోనే జరిగిపోయింది, ఆ రద్దు అన్నది ఇప్పుడు జరగదు. చూస్తున్నారా సూర బఖరా ఆయతు నెంబర్ 106.
(ఓ ప్రవక్తా!) ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరచినా లేక మరపింపజేసినా (దాని స్థానంలో) దానికన్నా ఉత్తమమైన దానినీ లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకువస్తాము. అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా? (2:106)
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్దేననీ, అల్లాహ్ తప్ప మరొకరెవరూ మీ రక్షకులూ, సహాయకులూ కారన్న విషయం నీకు తెలియదా? (2:107)
ఈ విధంగా అల్లాహు త’ఆలా తలచుకున్నప్పుడు రద్దు చేయగలుగుతాడు. అతన్ని ఎవరూ కూడా కాదు అనలేరు. కానీ ఈ ఆయతు యొక్క ఈ భావం, ఈ యొక్క బాహ్య భావమే కాకుండా మరొక భావం ఇందులో ఏముంది?
ఇందులో మరొక భావం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రత్యేకమైన అనుగ్రహం, ఆయన మరిచిపోకుండా ఆయన హృదయంలో ఖుర్ఆన్ ఆయతులు నాటుకుపోయి ఉండే విధంగా అల్లాహు త’ఆలా వారికి సహాయపడతాడు. కానీ మనం ఈ ఆయతులు మరిచిపోకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం, మన వంతు త్యాగం, ప్రయాసం మనం చేస్తూ ఉండాలి. ఒకవేళ ప్రయత్నం మనం చేశాము అంటే, ఆయతు నెంబర్ ఎనిమిది గమనించండి, మేము నీకు సౌలభ్యాన్ని సమకూరుస్తాము.
ఇక్కడ సౌలభ్యం అన్నది మనకు ఎప్పుడు ఏర్పడుతుంది? చిన్నపాటి కష్టం ఏదైనా మనం చేసిన తర్వాతనే సౌలభ్యం అన్నది మనకు ఏర్పడుతుంది కదా. అందుకొరకు ఖుర్ఆన్ యాద్ చేయడంలో కూడా మనం కష్టపడాలి. మన సమయాన్ని, మన నిద్రను, మన యొక్క ప్రయత్నాన్ని అందులో వెచ్చించాలి. అప్పుడు అది మనకు అల్లాహ్ యొక్క దయతో ఎంతో సులభతరం ఏర్పడుతుంది.
మరో రకంగా ఇందులో, నేను ప్రారంభంలోనే చెప్పినట్లు, శరీరపరంగా చూసుకుంటే ఇంకా వేరే రకంగా అల్లాహు త’ఆలా మనల్ని ఎంతో మంచిగా తీర్చిదిద్ది, ఎంతో మంచి రీతిలో పుట్టించిన వాడు, ‘ఫహదా’ అని చదివారు కదా, మూడవ ఆయతు చివరిలో ‘ఫహదా’. ఆ హిదాయత్ అల్లాహ్ ఎలా ఇచ్చాడు? ఖుర్ఆన్ ద్వారా, హదీస్ ద్వారా ఇచ్చాడు. కనుక మనం ఈ ఖుర్ఆన్, హదీస్ ను చదువుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకుంటూ ఉన్న తర్వాత సరిపోతుందా? లేదు, ఇతరులకు బోధ చేస్తూ ఉండాలి.
فَذَكِّرْ إِن نَّفَعَتِ الذِّكْرَىٰ “కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే, ఉపదేశిస్తూ ఉండు.” (87:9)
అదే విషయం గమనించండి ఆయతు నెంబర్ తొమ్మిదిలో, కనుక నీవు ఉపదేశం లాభదాయకం అయితే ఉపదేశిస్తూ ఉండు. ఈ లాభదాయకం అయితే అని ఏదైతే ఇక్కడ ఉన్నదో, లాభదాయకం లేకుంటే వదిలేయ్ అన్నటువంటి భావం కాదు. ఇక్కడ రెండు భావాలు కనీసం గుర్తుంచుకోండి.
ఒకటి, మీరు ఉపదేశం చేస్తూ ఉండండి, ఒకరికి బోధ చేస్తూ ఉండండి, ఈ బోధ అన్నది ఏదో ఒక రీతిలో లాభదాయకంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి విని అర్థం చేసుకొని ఆచరించకపోయినా, చెప్పేవారికి లాభమే కదా అందులో? చెప్పిన పుణ్యం లభిస్తుంది కదా? అవునా కాదా? మరియు రెండో భావం, ఈ ఎవరికైతే మనం చెప్పామో, విన్న వ్యక్తి, అది ఆ సమయంలో అతనికి లాభదాయకంగా ఏర్పడకపోయినా, ఒకానొక రోజు ‘అరే అవును, ఫలానా సమయంలో వాళ్ళు నాకు చెప్పారు కదా’ అన్నటువంటి ఒక సుబూత్, ఒక రుజువు అతని వద్ద ఉంటుంది. ఏదో ఒక రకంగా. కానీ గమనించండి. ఎవరైనా మనకు ఏదైనా ఉపదేశం చేస్తున్నారు, ఆ ఉపదేశం మనకు లాభదాయకం కావాలి అంటే ఏం ఉండాలి మనలో? ఆయతు నెంబర్ 10 గమనించండి.
చూస్తున్నారా? అందుకొరకే ఒక వ్యక్తి మనకు చెప్పాడు, ‘ఏంటయ్యా, నీవు కొంచెం నమాజ్ లో వెనక ఉన్నావు. ఏంటయ్యా, ఈ తాగుడు మానుకో. ఏంటయ్యా, ఈ పాపాన్ని వదులుకో.’ ‘అరే పోరా పో, నీది నువ్వు చూసుకో. నాకెందుకు చెబుతున్నావ్?’ ఇలా అనకూడదు. ఈ రోజుల్లో చాలా అలవాటు అయిపోయింది కదా ఎంతో మందికి ఇలా చెప్పడం. ఎందుకు? ఒక వ్యక్తి మనకు ఏదైనా ఉపదేశం చేశాడంటే, మనకు లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేశాడు అతను. అంతేకాదు, అల్లాహ్ మనపై దయ తలిచాడు. మనకు సన్మార్గం చూపించడంలో ఒకరి యొక్క సహాయం అల్లాహ్ మనకు అందించాడు. ఇక నేను ఇలా అడ్డం తిరిగి, ఇలాంటి తప్పుడు సమాధానం ఇచ్చానంటే, నేను అల్లాహ్ యొక్క భయం నా మనసులో లేనట్లే కదా. అర్థమవుతుందా అవతలేదా? అందుకొరకే సూర బఖరాలో ఒక చోట ఏమున్నది? ఎవరైతే అల్లాహ్ తో భయపడండి.
“అల్లాహ్కు భయపడు” అని వాడితో అన్నప్పుడు, వాడి గర్వం, దురభిమానం వాడ్ని పాపం వైపుకే పురికొల్పుతుంది. ఇలాంటి వారికి నరకమే గతి. అది అతి చెడ్డ నివాస స్థలం. (2:206)
అల్లాహ్ తో భయపడండి అని అంటే, అతడు విర్రవీగుతాడు. అహంకారానికి గురి అవుతాడు. నాకు చెప్పే వానివి ఎవనివి నువ్వు? అని ఎదురు తిరుగుతాడు. వాస్తవానికి ఇలాంటి వ్యక్తి ఎవడు? గమనించండి ఆ తర్వాత ఆయతు నెంబర్ 11.
وَيَتَجَنَّبُهَا الْأَشْقَى (వయతజన్నబుహల్ అష్ ఖా) “దౌర్భాగ్యుడు మాత్రమే దాన్ని దాట వేస్తాడు.” (87:11)
ఆ ఉపదేశాన్ని దౌర్భాగ్యుడు మాత్రమే దాటవేస్తాడు. అల్లాహు అక్బర్. ఏంటమ్మా, నువ్వు ఏదో పనికి బయటికి వెళ్తున్నావు కదమ్మా, కొంచెం పరదా చేసుకుంటూ వెళ్ళమ్మా. అల్లాహ్ ది ఈ ఆదేశం ఇచ్చాడు. ‘ఓ మౌల్సాబ్ మీరు మీ పని చూసుకోండి. మాకు ఇదంతా బోధ చేసే అవసరం లేదు.’ ఇలా ఉండకూడదు. ఎవరైనా ఇలా అడ్డం తిరిగారు, ఉపదేశాన్ని గ్రహించలేదు, ఉపదేశాన్ని స్వీకరించలేదు అంటే, నేను కాదండి చెప్పేది, అల్లాహ్ ఏమంటున్నాడో గమనించండి. అతడు అష్ ఖా, మహా దౌర్భాగ్యుడు అయిపోతాడు. ఇంతకుముందే నేను చెప్పాను కదా మీకు, షఖీ అంటే దౌర్భాగ్యుడు. అష్ ఖా అంటే మహా దౌర్భాగ్యుడు లేదా పెద్ద దౌర్భాగ్యుడు లేదా అత్యంత దౌర్భాగ్యుడు. ఈ విధంగా వస్తుంది భావం.
మనం ఇలాంటి ఏమైనా బోధనలు వింటేనే కదండీ మనకు అల్లాహ్ యొక్క భయం ఇంకింత ఎక్కువగా కలిగేది. మరి ఈ విషయాన్ని మనం తిరస్కరించేసాము అంటే, ఎవరైనా మనకు బోధ చేస్తున్నప్పుడు మనం అతని బోధను ఏమాత్రం గమనించకుండా, అర్థం చేసుకోకుండా ఉండేది ఉంటే, వాస్తవానికి మనకు మనం దౌర్భాగ్యాన్ని కొనుక్కున్న వాళ్ళం అయిపోతాము. ఇక ఇలా ఉపదేశాన్ని తిరస్కరించి, ఖుర్ఆన్, హదీసుల మాటలను మనం అర్థం చేసుకోకుండా, చెప్పిన వానికే అడ్డంగా తిరిగి ప్రవర్తించామంటే, దౌర్భాగ్యులైపోయాము. ఈ దౌర్భాగ్యుని పరిస్థితి ఏమవుతుంది? గమనించండి ఆయతు నెంబర్ 12 లో.
الَّذِي يَصْلَى النَّارَ الْكُبْرَىٰ (అల్లదీ యస్లన్-నారల్ కుబ్రా) వాడు పెద్ద (ఘోరమైన) అగ్నిలోకి ప్రవేశిస్తాడు. (87:12)
వాడు పెద్ద ఘోరమైన అగ్నిలోకి ప్రవేశిస్తాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి ఈ దౌర్భాగ్యం నుండి కాపాడు గాక. అల్లాహు త’ఆలా నరక ప్రవేశం నుండి కూడా మనల్ని కాపాడు గాక. అయితే ప్రతిరోజు కనీసం మూడుసార్లు దువా చేసుకుంటూ ఉండాలి. ‘ఓ అల్లాహ్ నన్ను స్వర్గంలో ప్రవేశించు, ఓ అల్లాహ్ నన్ను నరకం నుండి కాపాడు’ అని కనీసం మూడుసార్లు మనం ఇలా దువా చేసుకుంటూ ఉండాలి. ఆ నరకం ఎలాంటిది? అక్కడ శిక్షలు భరించలేక చనిపోదామని మనిషి కోరుకుంటాడు. కానీ,
వాడు అందులో చావనైనా చావడు. చస్తే ఏమవుతుంది? ఈ కష్టాలన్నిటినీ కూడా చూడకుండా ఉంటాము. కానీ చావు రాదు. వలా యహ్యా, బ్రతకనైనా బ్రతకడు. అంటే ఈ శిక్షలను తప్పించుకొని ఏదైనా మంచి బ్రతుకు కూడా దొరకదు. ఏ స్థితిలో ఉంటాడు? కేవలం అనువాదం చదివి ఎవరికైనా కన్ఫ్యూజ్ కాకూడదు అని బ్రాకెట్లో అక్కడ రాశారు, రెంటికీ మధ్య దుర్భర స్థితిలో ఉంటాడు. అల్లాహు అక్బర్. అల్లాహు త’ఆలా ఈ నరక శిక్షల నుండి మనందరినీ కూడా కాపాడు గాక.
ఇక్కడ చూస్తున్నారా, మనిషి నరకంలో శిక్షలను భరించలేక ఏమంటాడు? చూడండి ఇక్కడ. సూర నెంబర్ 25, ఆయతు నెంబర్ 13, 14.
وَإِذَا أُلْقُوا مِنْهَا مَكَانًا ضَيِّقًا مُّقَرَّنِينَ دَعَوْا هُنَالِكَ ثُبُورًا నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్ళూ, చేతులూ బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు వారు చావు కోసం అరుస్తారు. (25:13)
నరకంలోని ఒక ఇరుకైన స్థలంలో వారిని కాళ్లు, చేతులు బంధింపబడిన స్థితిలో పడవేయబడినప్పుడు, ద’అవ్ హునాలిక సుబూరా, వారు అక్కడ చావు కోసం అరుస్తారు. మాకు చావు రావాలని కోరుకుంటారు.
لَّا تَدْعُوا الْيَوْمَ ثُبُورًا وَاحِدًا وَادْعُوا ثُبُورًا كَثِيرًا (లా తద్ ఉల్ యవ్మ సుబూరవ్ వాహిదవ్ వద్ ఉ సుబూరన్ కసీరా) “ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి” (అని వారితో అనబడుతుంది). (25:14)
ఈ రోజు ఒక్క చావు కోసం అరవకండి, అనేక చావుల కోసం అరుస్తూ ఉండండి అని వారితో అనబడుతుంది. అంటే ఏంటి? అనేక చావుల కోసం అరిస్తే చావు వస్తుందనా? కాదు. ఇక్కడ మీరు ఇక ఒర్రుకుంటూ ఉండాల్సిందే. ఇప్పుడు మీ మాట వినడం జరగదు. ఇహలోకంలో ఎంతమంది మంచి వాళ్ళు వచ్చి మీకు చెబుతూ ఉంటే మీరు ఇలాగే మా మాటలు తిరస్కరించారు కదా.
అలాగే మనం ఇంతకుముందు కూడా చదివి వచ్చాము సూరతుల్ ఇన్షిఖాఖ్ లో ఈ ఆయతు.
وَيَدْعُو ثُبُورًا (వ యద్ ఉ సుబూరా) అతను చావు కోసం కేకలు వేస్తాడు. (84:11)
మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనక నుండి ఇవ్వబడుతుందో అతను చావు కోసం కేకలు వేస్తాడు.
إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا (ఇన్నహూ కాన ఫీ అహ్లిహీ మస్రూరా) ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. (84:13)
ఈ వ్యక్తి ఇహలోకంలో తన వారి మధ్య తెగ సంబరపడేవాడు. ఈ రోజుల్లో ముస్లింలకు బాధ కలిగిస్తూ తిరిగి వెళ్లి తమ యొక్క గ్యాంగ్ లో, గ్రూప్ లో, తమ యొక్క ఇంటివారు, తమ యొక్క ఫ్రెండ్స్ వారందరికీ ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ తిరుగుతారు కదా. కానీ ప్రళయ దినాన పరిస్థితి చాలా గాంభీర్యంగా ఉంటుంది.
సూరహ్ అల్-ఆ`లా – 14 నుండి 19 ఆయతులు
ఇక రండి అల్లాహు త’ఆలా ఈ కొన్ని విషయాలు తెలిపిన తర్వాత మళ్ళీ ఏ రీతిలో మనకు బోధ చేస్తున్నాడో గమనించండి.
కచ్చితంగా సాఫల్యం పొందాడు. ఎవరండి? పవిత్రుడైన వాడు. మన్ తజక్కా. ‘తజక్కా’ పవిత్రత అంటే ఇక్కడ, మనిషి అన్ని రకాల షిర్క్, బిద్’అత్ ల నుండి. తజక్కా, అన్ని రకాల షిర్క్, బిద్’అత్ లకు దూరంగా ఉండాలి. తజక్కా, తన మనసును పరిశుభ్ర పరచుకోవాలి. ఏ కపటము, జిగత్సు, ఎలాంటి అసూయ లాంటి చెడు గుణాలు లేకుండా ఉండాలి.
وَذَكَرَ اسْمَ رَبِّهِ فَصَلَّىٰ (వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా) అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. నమాజు ఆచరించాడు.(87:15)
అతను తన ప్రభువు నామాన్ని స్మరించాడు. ఈ విషయంలో కూడా సర్వసామాన్యంగా మన వద్ద చాలా చాలా బద్ధకం ఉన్నది. ధర్మం తెలిసిన వాళ్లలో కూడా. కూర్చుంటూ, లేస్తూ, ఎల్లవేళల్లో అల్లాహ్ యొక్క నామస్మరణ చేయడం, సుబ్ హా నల్లాహ్, అల్హందులిల్లాహ్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, ఏదైనా సందర్భంలో ఎవరితోనైనా కలిసినప్పుడు ఆ ఏదైనా మాట సందర్భంలో ఏదైనా విషయం, ఇలాంటి సందర్భాల్లో అల్హందులిల్లాహ్, సుబ్ హా నల్లాహ్, బారకల్లాహు ఫీక్, అహసనల్లాహు ఇలైక్, ఇలాంటి దువాలు ఇచ్చుకుంటూ మనం ఉండడం, అల్లాహ్ ను గుర్తు చేసుకుంటూ ఉండడం ఎల్లవేళల్లో చాలా ముఖ్య విషయం.
అలాగే నమాజ్ ఆచరించాడు. ఆరాధనల్లో కలిమ లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత నమాజ్ యొక్క ప్రాముఖ్యత చాలా గొప్పది గనక అందుకొరకే ఇక్కడ దాని ప్రస్తావన వచ్చింది. ఈ రెండు ఆయతులు, ఆయతు నెంబర్ 14 మరియు 15 ఏదైతే మీరు చూస్తున్నారో, ఇందులో మరొక భావం కూడా ఉంది అని ధర్మవేత్తలు అంటారు. అదేమిటి?
ఈ ఆయతులలో ఈదుల్ ఫితర్, రమజాన్ ముగింపు, సదఖతుల్ ఫితర్, ఈద్ యొక్క నమాజ్, వీటి ప్రస్తావన ఉన్నది అని. ఏ రీతిలో? ఇదే క్రమంలో. మన్ తజక్కా వ-జకరస్మ రబ్బిహీ ఫసల్లా. రమజాన్ ముగించినది, నెలవంక కనబడినది, ఇప్పుడు మనం పండుగ జరుపుకోవాలి అని తెలిసిన వెంటనే తజక్కా, జకాతుల్ ఫితర్ ఇవ్వాలి, సదఖతుల్ ఫితర్ ఇవ్వాలి, ఫిత్రానా చెల్లించాలి. అప్పటి నుండే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ చదువుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ఎప్పటి వరకు? పండుగ స్థలానికి చేరుకునే వరకు. ఆ తర్వాత ఖుత్బా కంటే ముందు నమాజ్ అదా చేయాలి. సూరతుల్ ఆ`లాలోని ఆయతు నెంబర్ 14 మరియు 15లో రమజాన్ ముగింపు, నెలవంక వెంటనే జకాతుల్ ఫితర్ చెల్లించడం మరియు అప్పటి నుండే తక్బీర్ చెప్పుకుంటూ ఉండడం, మరుసటి రోజు తెల్లారిన తర్వాత సూర్యోదయం అయ్యాక 15, 20 నిమిషాల తర్వాత నుండి పండుగ నమాజ్ చేయడం ప్రారంభించడం, వీటి ప్రస్తావన ఉన్నది. మరియు సూరతుల్ కౌసర్ లో
فَصَلِّ لِرَبِّكَ وَانْحَرْ (ఫసల్లి లిరబ్బిక వన్ హర్) కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి, ఖుర్బానీ కూడా ఇవ్వు. (108:2)
ముందు నమాజ్ చేయాలి, ఆ తర్వాత వచ్చి ఖుర్బానీ చేయాలి అన్నటువంటి ప్రస్తావన అందులో ఈదుల్ అద్హాకు సంబంధించిన ఆదేశం ఉన్నది.
ఈ విధంగా అల్లాహు త’ఆలా మనకు అల్లాహ్ మనపై చేసిన అనుగ్రహాలను గుర్తు చేస్తున్నాడు. శారీరక అనుగ్రహాలే కాకుండా మన ఆధ్యాత్మిక, మన యొక్క ఆత్మీయంగా మనకు కావలసిన హిదాయత్ ఖుర్ఆన్, హదీస్ ద్వారా దొరుకుతుంది, దాని గురించి చెప్పిన తర్వాత ఎవరైతే ఈ ఖుర్ఆన్, హదీస్ బోధనలు తిరస్కరిస్తారో వారికి ఈ చెడ్డ స్థానం ఉన్నదో అది తెలిపిన తర్వాత చెడ్డవారు అని చెప్పాడు కదా అల్లాహు త’ఆలా ఇక్కడ అష్ ఖా, అతడు నరకంలో ప్రవేశిస్తాడు అని. అందుకొరకే వెంటనే అల్లాహు త’ఆలా ఇక్కడ అఫ్లహ. దౌర్భాగ్యుడు నరకంలో వెళ్తాడు. మరి ఆ దౌర్భాగ్యునికి భిన్నంగా, ఆపోజిట్ లో ఉండేవాడు ఎవడు? సౌభాగ్యవంతుడు, సాఫల్యం పొందేవాడు. వారి యొక్క గుణాలు ఏంటి? ఇలా ఉంటాయి.
కానీ ఈ రోజుల్లో అనేకమంది తమకు తాము ముస్లింలు అనుకుంటూ కూడా ఎలా ప్రవర్తిస్తున్నారు? 16వ ఆయతులో అల్లాహ్ తెలిపాడు.
بَلْ تُؤْثِرُونَ الْحَيَاةَ الدُّنْيَا (బల్ తు`సిరూనల్ హయాతద్-దున్యా) కాని మీరు మాత్రం ప్రాపంచిక జీవితానికే ప్రాముఖ్యమిస్తున్నారు. (87:16)
కానీ మీరు మాత్రం ప్రాముఖ్యతనిస్తున్నారు ప్రాపంచిక జీవితానికి. ఈ రోజుల్లో ఇలాగే జరుగుతుంది కదా మనలో అనేకమంది. కానీ వాస్తవం ఏమిటి?
وَالْآخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰ (వల్-ఆఖిరతు ఖైరువ్-వ అబ్ ఖా) వాస్తవానికి పరలోకం ఎంతో మేలైనది, ఎప్పటికీ మిగిలి ఉండేది.(87:17)
ఈ విషయాన్ని గమనించండి ఇక్కడ. ఇహలోకం ఎప్పటికీ మిగిలి ఉండేది కాదు. ఎప్పటికీ మిగిలి ఉండేది పరలోకం. ఇహలోకం మంచిది ఎప్పుడు? దానిని నీవు పరలోకం మంచి కొరకు ఉపయోగిస్తున్నప్పుడు. ఇహలోకంలో ఉండి పరలోకం గురించి నీవు ఆలోచించకుంటే, నీ ఇహలోకం కూడా పాడే, పరలోకం కూడా పాడైపోతుంది.
إِنَّ هَٰذَا لَفِي الصُّحُفِ الْأُولَىٰ (ఇన్న హాజా లఫిస్-సుహుఫిల్ ఊలా) ఈ విషయాలు మునుపటి గ్రంథాలలోనూ ఉన్నాయి. (87:18)
ఈ బోధనలు, ఈ విషయాలు మునుపటి గ్రంథాలలో ఉన్నాయి. ఎవరి గ్రంథాలు?
ఈ విధంగా ఇక్కడి వరకు సూరా సమాప్తమైనది. సోదర మహాశయులారా, ఈ సూరాలో మనకు ఉన్నటువంటి బోధనలు ఎంత చక్కగా అల్లాహు త’ఆలా తెలిపాడో అర్థం చేసుకొని, దాని ప్రకారంగానే మీరు ఆచరించే ప్రయత్నం చేయండి.
ప్రశ్నలు & సమాధానాలు
(1) ఒక చిన్న డౌట్ ఏంటంటేమనము ఇషా నమాజ్ చదివేటప్పుడు, కొంతమంది ఏమో ఫజర్ నమాజ్ వరకు కూడా ఇషా టైం ఉంటుంది అని చెప్తారు. కొందరేమో అంత టైం ఉండదు అంటారు. అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని వల్ల కానీ, ఏదైనా ప్రయాణం వల్ల కానీ, ఏదైనా ఒక కారణం వల్ల మనం నమాజ్ చదవలేకపోతే, నమాజ్ టైం అనేది మనకు ఉదయం ఫజర్ నమాజ్ స్టార్ట్ అయ్యేంత వరకు ఉన్నట్టేనా సార్?
మీరు అడిగిన ఈ ప్రశ్నకు సంబంధించి నేను మూడు మాటలు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి మీరందరూ కూడా. అర్థం చేసుకోండి, ఇప్పుడు ఉన్నవారు, తర్వాత ఆన్లైన్ లో వినేవారు, YouTube లో వినేవారు. మొదటి విషయం, ప్రతీ నమాజ్ కొరకు ఒక ప్రారంభ సమయం, ఒక ముగింపు సమయం అనేది ఉంటుంది. ఇక మీరు ఇషా విషయంలో అడిగారు గనక, ఇషా యొక్క సమయం రాజిహ్ ఖౌల్, ప్రియారిటీ ప్రాధాన్యత లభించినటువంటి మాట ఆధారంగా, దేనికైతే ఎక్కువ హదీసులు ఆధారంగా ఉన్నాయో దాని పరంగా ఇషా ముగింపు సమయం అర్ధరాత్రి. ఇక్కడ అర్ధరాత్రి అంటే సర్వసామాన్యంగా రాత్రి 12 గంటలు మిడ్ నైట్ అని అంటారు అలా కాదు. సూర్యాస్తమయం నుండి ఫజర్ ప్రారంభ సమయం వరకు ఎన్ని గంటలు ఉంటాయో అందులో మీరు సగం చేయాలి. ఇది ఒక మొదటి మాట.
రెండో మాట ఏమిటంటే, కొన్ని హదీసుల ఆధారంగా ఫజర్ వరకు కూడా ఇషా సమయం ఉన్నది అని కొందరి అభిప్రాయం ఉన్నది. కానీ ఇంతకుముందే నేను చెప్పినట్టు మొదటి మాటలో రాజిహ్, ప్రాధాన్యత కలిగిన ప్రియారిటీ ఇవ్వబడిన ఆధారాల ప్రకారంగా, ప్రియారిటీ ఇవ్వబడినటువంటి మాట ఏమిటి? అర్ధరాత్రి మాట ఎక్కువ నిజం.
ఇక మూడో మాట, ప్రత్యేకంగా ఇషాకు సంబంధించి కానివ్వండి లేదా ఏ నమాజ్ అయినా, ఏదైనా ధర్మపరమైన కారణం వల్ల మనం ఏదైనా నమాజ్ దాని ముగింపు సమయానికంటే ముందే చేయలేకపోతే, అయ్యో ఇక సమయం అయిపోయింది కదా అని ఊరుకుండేది కాదు. ఆ నమాజ్ ను తప్పకుండా మనం చేయాలి. ఒకవేళ సమయం అయిపోయినప్పటికీ కూడా ఆ నమాజ్ తప్పకుండా చేయాలి. కానీ, సమయం దాటిన తర్వాత చేసిన నమాజ్ యొక్క పుణ్యం, దాని సమయం దాటక ముందే చేసిన నమాజ్ పుణ్యం మరియు నమాజ్ యొక్క దాని తొలి సమయంలో చేసే నమాజ్ పుణ్యం, ఈ మూడిటిలో తేడాలు ఉంటాయి. అయితే నేను ఇక్కడ మీతో అందరితో ఒక ప్రశ్న అడుగుతున్నాను, మూడు సమయాలు చెప్పాను నేను. ఒక మనిషి, ఉదాహరణకు ఒక మనిషి ఇషా నమాజ్ దాని తొలి సమయంలో చదివాడు. మరొక మనిషి దాని ఇషా నమాజ్ దాని చివరి సమయంలో చదివాడు. అంటే సమయం దాటక ముందే, ముగింపు కంటే కొంచెం ముందు. మూడో వ్యక్తి సమయం దాటిపోయిన తర్వాత చదివాడు. ఈ ముగ్గురిలో ఎవరికి ఎక్కువ పుణ్యాలు లభిస్తాయండి?
తొలి సమయంలో చేసిన వ్యక్తికి.
బారకల్లాహు ఫీ ఇల్మికుం. కరెక్ట్ సమాధానం. మాషాఅల్లాహ్, మాషాఅల్లాహ్. మన ఈ ఆన్లైన్ లో వింటున్న వారు ఏదో బండిపై లేదా బస్సులో లేదా వెహికల్ పై ప్రయాణం చేసుకుంటూ కూడా వింటున్నారు అన్నట్లుగా కనబడుతుంది. జజాకుముల్లాహు ఖైర్ వంట చేసుకుంటూ కూడా, ఇల్లు ఊడ్చుకుంటూ కూడా, బట్టలు ఉతుక్కుంటూ కూడా, మీ పనులు చేసుకుంటూ కూడా మాషాఅల్లాహ్ తబారకల్లాహ్ మీరు ఈ పాఠాలు వింటున్నారు అంటే అల్హందులిల్లాహ్ మంచి విషయం. మీ యొక్క సమయాన్ని ఒక పుణ్య కార్యంలో గడుపుతున్నారు. అయితే ఇషా సమయంకి నమాజ్ కి సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లభించింది కదా?
అల్హందులిల్లాహ్ సార్. అర్థమైంది సార్. ఈ సందర్భాల్లో అప్పుడు చదువుదాము అనుకున్నప్పటికీ ఏదైనా చాలా పని కానీ ప్రయాణాలు ఉన్నప్పుడు అలసట అనిపిస్తుంది సార్. అప్పుడు ఇలా తెలిసింది అన్నమాట. అలా చదవకూడదు, మాక్సిమం అర్ధరాత్రి లోపు ఉంది అన్నప్పుడు అది కొద్దిగా భయం అనిపించింది సార్.
మీరు అడిగిన దానికి, మీరు ఇంత మాట చెప్పిన దానికి మరొక సలహాగా నేను ఒక మాట చెబుతున్నాను, బహుశా ఇంట్లో ఉండే ప్రతీ స్త్రీకి కానివ్వండి లేదా ఏదైనా నైట్ డ్యూటీ చేసేవారు లేదా కొందరు మధ్యాహ్న డ్యూటీ చేస్తారు, వారి డ్యూటీ అయిపోయేసరికి రాత్రి 11, 12 ఇలా అవుతుంది. అయితే ఆ విషయం ఏంటంటే, ఎవరైనా ఇషా నమాజ్ విషయంలో ప్రత్యేకంగా చాలా అలసిపోవడం వల్ల, చాలా పని ఉండడం వల్ల, చాలా ఇరుకులో చిక్కుకొని ఉన్నారు, ఆ నమాజ్ కొరకు సమయం కలగడం లేదు, అలాంటి వారు ఇషా ప్రాధాన్యత ఇవ్వబడిన సమయం అర్ధరాత్రి అని ఏదైతే తెలుసుకున్నామో, ఆ సమయం దాటక ముందు కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. కనీసం ఫర్ద్ నాలుగు రకాతులు చేసుకోండి. ఆ తర్వాత దాని యొక్క సున్నత్, విత్ర్, ఇవన్నీ మీరు ఆ తహజ్జుద్ కొరకు లేచినప్పుడు, ఫజర్ కు ముందు లేచినప్పుడు చేసుకున్నా ఇబ్బంది లేదు, పాపం ఏమీ లేదు ఇన్షాఅల్లాహ్.
(2) షేఖ్ గారు నాకు ఒక డౌట్. డౌట్ అంటే ఇప్పుడు క్లాస్ గురించి కాదు షేఖ్ గారు. ఖురాన్ గురించి. ఖురాన్ ఇప్పుడు నాకు కొన్ని కొందరు ఏమన్నారంటే, ఖురాన్ ని ఉదూ లేకుండా కూడా పట్టుకోవచ్చు కానీ ఓపెన్ చేయకూడదు అన్నారు షేఖ్. ఇప్పుడు మనకు ఉదూ పోతూ ఉంటాది కదా షేఖ్ గారు, బాత్రూమ్ పోయినప్పుడు ఇట్లా ఉదూ పోతూ ఉంటాది కదా. అలాంటప్పుడు మనం ఖురాన్ ఓన్లీ పట్టుకోవచ్చు, ఎవరైనా అడిగారు ఖురాన్ ఇవ్వొచ్చు అంటే ఓపెన్ చేయకూడదు అన్నారు. ఇది కరెక్టా కాదా అని నా డౌట్ షేఖ్ గారు.
అయితే ఇక్కడ కొందరు ఉలమాలు ఏదైతే పట్టుకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు కానీ తెరవకూడదు అని ఏదైతే అన్నారో, తెరవకూడదు అని అంటే అక్కడ భావం, ఆయతులు అరబీలో ఏవైతే రాసి ఉన్నాయో, ఆ ఆయతులు రాసి ఉన్న చోట తమ ఆ చెయ్యి, వేలు పెట్టకుండా ఉంటే మరీ మంచిది అని అంటారు. అది అసలు విషయం. పవిత్రత, పరిశుభ్రంగా లేని సమయంలో ఖురాన్ పట్టుకోకూడదు అని అంటే, ప్రత్యేకంగా ఆయతులు రాసి ఉన్న చోట మన ఆ శరీర భాగం తగలకుండా ఉండడం మంచిది అని అంటారు. కానీ వేరే దాని బైండింగ్ లేదా అది కవర్ లో ఉన్నది, ఆ రీతిలో పట్టుకొని మనం ఎవరికైనా ఇస్తున్నాము, తీసుకుంటున్నాము ఇబ్బంది లేదు అని అంటారు.
అల్హందులిల్లాహ్. అదే మేము ఇక్కడ మా కువైట్ లో మా మా ఇంట్లో ఆమె మా మామయ్య చెప్పిందంట ఖురాన్ ఇవ్వమంటే నేను ఉదూ లేదు మామ్మ అంటే ఏమీ పట్టుకోవచ్చు, ఇవ్వొచ్చు ఇబ్బంది లేదు. మనం ఓన్లీ ఓపెన్ చేసి చదవకూడదు అని చెప్పింది
(3) ఆ షేఖ్, స్టార్టింగ్ లో చెప్పారు కదా జెండా వందనం గురించి, కొబ్బరికాయ కొట్టి దండం పెడతారు కదా షేఖ్, అది ఒకసారి చెప్పరా మళ్ళీ?
నేను మరోసారి చెబుతున్నాను. నేను అక్కడ చెప్పిన ఉదాహరణ ఇచ్చాను నేను, ఏమి ఇచ్చాను? మనం అల్లాహ్ యొక్క పవిత్రతను మన ఆచరణ ద్వారా కూడా వ్యక్తపరచాలి. ఆచరణ ద్వారా ఎలా వ్యక్తపరచాలి? ఎన్నో సందర్భాలు ఉండవచ్చు మన జీవితంలో అలాంటివి రావచ్చు. కానీ సర్వసామాన్యంగా అందరికీ తెలుస్తది అని నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. ఏంటి ఉదాహరణ అది? మీరు ఆ జెండా వందనం అని ఏదైతే అంటారో, అది కరెక్ట్ పదం ఏంటో నాకు తెలియదు. సర్వసామాన్యంగా ప్రజలు అంటూ ఉంటారు కానీ, 15th ఆగస్టు లేదా ఇలాంటి సందర్భంలో అక్కడ ఏదైతే జెండా వద్ద మన ఇందిరా గాంధీ లేకుంటే మన గాంధీజీ, నెహ్రూ గారి యొక్క ఫోటోలు ఏదైతే పెడతారో, అక్కడ ఎంతోమంది కొబ్బరికాయ కొడతారు. అయితే మన ముస్లింలలో కొందరు ఏమనుకుంటారు, నేను సుబ్ హా నల్లాహ్ అనుకుంటాను తర్వాత క్షమాపణ కోరుకుంటాను, కానీ ఒక నా టెంకాయ కొట్టేద్దాము. ఇలా టెంకాయ కొట్టడం మన ఆచరణ పరంగా మనం సుబ్ హా నల్లాహ్ కు వ్యతిరేకం చేస్తున్నట్లు. కనుక అలాంటి చోట టెంకాయ కూడా కొట్టకూడదు.
జజాకుముల్లాహు ఖైర, బారకల్లాహు ఫీకుం, కతబల్లాహు అజ్రకుం. అల్లాహు త’ఆలా ఖురాన్ ను మంచిగా అర్థం చేసుకొని, ప్రవక్త హదీసులను చదువుతూ అర్థం చేసుకొని, వాటి ప్రకారంగా మన జీవితాన్ని మలుచుకునే భాగ్యం ప్రసాదించు గాక. ఆమీన్, వ ఆఖిరు దావాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
ఈ ప్రసంగంలో షేక్ సలీం జామిఈ గారు హజ్ యొక్క ఘనత మరియు విశిష్టతలను ఖురాన్ మరియు హదీసుల వెలుగులో వివరిస్తారు. హజ్ ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటని, దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం అని, అది గడిచిన పాపాలన్నింటినీ మరియు పేదరికాన్ని కూడా తొలగిస్తుందని ప్రవక్త వచనాల ఆధారంగా వివరిస్తారు. హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు అని, వారి ప్రార్థనలు స్వీకరించబడతాయని పేర్కొంటారు. హజ్ కు వెళ్లే వారికి ముఖ్యమైన సూచనలు ఇస్తూ, స్తోమత కలిగిన వెంటనే హజ్ చేయాలని, హలాల్ సంపాదనతోనే చేయాలని మరియు హజ్ సమయంలో గొడవలు, అశ్లీలతకు దూరంగా ఉండాలని బోధిస్తారు. వ్యాధిగ్రస్తులు మరియు పసిపిల్లల తరఫున హజ్ చేసే విధానాలను కూడా ప్రస్తావిస్తారు. చివరగా, హజ్ నుండి నేర్చుకోవలసిన ఐక్యత, సమానత్వం మరియు ఏకేశ్వరోపాసన వంటి గుణపాఠాలను గుర్తుచేస్తూ ప్రసంగాన్ని ముగిస్తారు.
అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించు గాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించు గాక. ఆమీన్
గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీయ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు
హజ్ ఘనత
ఇంతకుముందు మీరు విన్నట్టుగా, ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం.
చూడండి, ఎప్పటి నుంచి అయితే రమజాను మాసము ముగిసిపోయిందో, షవ్వాల్ నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదేపదే వార్తా ఛానళ్లలో అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం, అదేమిటంటే దైవభక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం.
కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం, ఇన్ షా అల్లాహ్
హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ, మనసులో మనమంతా అల్లాహ్ ను కోరుకుందాం. అదేమిటంటే, “ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనం ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో, వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు.”, ఆమీన్
హజ్ ప్రాముఖ్యత – ఇస్లాం యొక్క ఐదు మూలస్తంభాలలో ఒకటి
అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ ఐదు విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో, ఆ ముఖ్యమైన ఐదు అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది.
దీనికి ఆధారం మనం చూసినట్లయితే, బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు:
“ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మించబడింది: అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్య దేవుడు లేడని మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని సాక్ష్యం పలకడం, నమాజు స్థాపించడం, జకాత్ ఇవ్వడం, అల్లాహ్ గృహం (కాబా) యొక్క హజ్ చేయడం మరియు రమదాన్ ఉపవాసాలు పాటించడం.“
ఇస్లాం ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే, మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది ఐదు ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ ఐదు విషయాలు, ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవ్వరూ నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే, రెండవది, నమాజు ఆచరించటం. అలాగే, జకాతు చెల్లించటం. అల్లాహ్ పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లాహ్ గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వసౌమి రమదాన్, రమదాన్ నెల ఉపవాసాలు పాటించటం.
ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఐదు ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది, అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు కాబట్టి, హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయం కాదు, ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది.
హజ్ ఎవరిపై విధి?
ఇక ఆ తర్వాత, హజ్ ఎవరి మీద విధి చేయబడింది అంటే, ధార్మిక పండితులు ఐదు, ఆరు విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదు అన్నమాట. అలాగే, ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేని వారు, పిచ్చి వారు ఉంటారు కదండీ, అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి, అంటే పసి పిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి, అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి, అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు.
ఏమండీ? ఇక్కడ నేను ఐదు విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగి ఉన్న వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు.
అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా ‘మహరమ్’ కూడా జతగా ఉండాలి. మహరమ్ అంటే ఎవరు? ఆ మహిళతో ఆ పురుషునితో ఎప్పటికీనీ ఏ విధంగాను, ఏ కారణంగాను వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించారో కదా, అలాంటి వారిని ‘మహరమ్’ అంటారు. ఉదాహరణకు, మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ కారణంగాను జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరమ్ అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి, అవన్నీ ఇన్ షా అల్లాహ్ సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం.
హజ్ ఘనతలు మరియు విశిష్టతలు
ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇన్ షా అల్లాహ్ మీ ముందర ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి, ఇన్ షా అల్లాహ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించు గాక.
స్వీకరించబడిన హజ్ యొక్క ప్రతిఫలం స్వర్గం
హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కొన్ని కొన్ని పుణ్యాలు నిర్ణయించి ఉన్నాడు. అయితే, కొన్ని సత్కార్యాలు, పుణ్య కార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయి అంటే, వాటికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండీ, ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు:
الْحَجُّ الْمَبْرُورُ لَيْسَ لَهُ جَزَاءٌ إِلَّا الْجَنَّةُ (అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహూ జజావున్ ఇల్లల్ జన్నాహ్) “స్వీకరించబడిన హజ్ కు బదులుగా స్వర్గం తప్ప మరే ప్రతిఫలము లేదు.“
అంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో, దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్ షా అల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే, హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్ షా అల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండీ? ఇది మొదటి ఘనత.
హజ్ పాపాలను తుడిచివేస్తుంది
రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది, దాని వల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది.
ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో ‘బైఅత్‘ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు.
ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ‘బైఅత్’ (ప్రతిజ్ఞ) చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్లీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్లీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, “ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే, నాది ఒక షరతు అండీ. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ, నేను ఇంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేశానో అవన్నీ అల్లాహ్ మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను,” అన్నారు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
“నీకు తెలియదా, ఇస్లాం (స్వీకరించడం) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హిజ్రత్ (వలస) దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని? మరియు హజ్ దాని ముందున్న (పాపాలన్నింటినీ) తుడిచివేస్తుందని?” ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం.
ప్రవక్త వారు ఏమంటున్నారంటే, “ఓ అమ్ర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి.” అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి. ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రతు చేస్తాడో, హిజ్రతు చేయగానే, వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయం నీకు తెలియదా? అలాగే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, అతని హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, అతని గత పాపాలన్నీ మన్నించవేయబడతాయి, ఈ విషయము నీకు తెలియదా?” అని ప్రవక్త వారు మూడు విషయాల గురించి ప్రస్తావించారు.
మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన మూడు విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో, ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి, తెలియక ఎన్ని పాపాలు దొర్లిపోయి ఉంటాయండి? అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండీ. కాబట్టి, హజ్ యొక్క ఘనత ఏమిటంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో, వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్.
హజ్ పాపాలను & పేదరికాన్ని తొలగిస్తుంది
అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదేపదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారి పాపాల క్షమాపణతో పాటు, వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరానీ గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం, ప్రవక్త వారు తెలియజేశారు:
మీరు హజ్ మరియు ఉమ్రాలను నిరంతరం చేస్తూ ఉండండి. ఎందుకంటే అవి రెండూ పేదరికాన్ని మరియు పాపాలను తొలగిస్తాయి, కొలిమి ఇనుము యొక్క మాలిన్యాన్ని తొలగించినట్లుగా.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, “మీరు పదేపదే హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి.” అంటే, పదేపదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా హజ్ లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదేపదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో, మనం చూస్తున్నాం కదా, ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో, దానిని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయటం వలన, పదేపదే హజ్ ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి, భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషా అల్లాహ్. ఇది కూడా ఒక గొప్ప ఘనత అండీ.
గొప్ప సత్కార్యాలలో హజ్ ఒకటి
అలాగే, ఇంతకుముందు మనం విన్నట్టుగా, హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు, గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు:
أَيُّ الْعَمَلِ أَفْضَلُ (అయ్యుల్ అమలి అఫ్దల్) ఏ సత్కార్యము గొప్పది?
అని అడిగాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తూ అంటున్నారు:
إِيمَانٌ بِاللَّهِ وَرَسُولِهِ (ఈమాను బిల్లాహి వ రసూలిహి) అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం.
గమనించండి. మళ్లీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, “ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది?” అంటే, ప్రవక్త వారు అంటున్నారు:
جِهَادٌ فِي سَبِيلِ اللَّهِ (జిహాదున్ ఫీ సబీలిల్లాహ్) అల్లాహ్ మార్గంలో జిహాద్ (ధర్మయుద్ధం) చేయడం.
మళ్లీ ఆ వ్యక్తి మూడవ సారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, “ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యము దైవప్రవక్త?” అంటే, ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
అంటే, అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు కాబట్టి, హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి.
వృద్ధులకు, బలహీనులకు మరియు మహిళలకు హజ్ ఒక జిహాద్
అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధం చేస్తారండి వెళ్లి యుద్ధ మైదానంలో? వాళ్లు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు. “ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా, మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో జిహాద్ లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా?” అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు:
لَكُنَّ أَفْضَلُ الْجِهَادِ: حَجٌّ مَبْرُورٌ (లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్) “మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాద్ తో సమానమైనది.” [బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం.]
మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
جِهَادُ الْكَبِيرِ وَالضَّعِيفِ وَالْمَرْأَةِ: الْحَجُّ وَالْعُمْرَةُ (జిహాదుల్ కబీరి వజ్జయీఫి వల్ మర’అతి అల్ హజ్జు వల్ ఉమ్రా) వృద్ధుని, బలహీనుని మరియు స్త్రీ యొక్క జిహాద్: హజ్ మరియు ఉమ్రా.
అంటే, ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లాహ్ మార్గంలో జిహాద్ లో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూశారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో.
హజ్ యాత్రికులు అల్లాహ్ యొక్క అతిథులు
అలాగే ఎవరైతే హజ్ చేయడానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయడానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో, వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లాహ్ అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్నె హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు:
“అల్లాహ్ మార్గంలో పోరాడే యోధుడు, హజ్ చేసేవాడు మరియు ఉమ్రా చేసేవాడు అల్లాహ్ యొక్క అతిథులు. ఆయన వారిని పిలిచాడు, వారు సమాధానమిచ్చారు. వారు ఆయనను అడిగారు, ఆయన వారికి ఇచ్చాడు.“
అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి. ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది గమనించండి. అల్లాహ్ మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురూ కూడా అల్లాహ్ అతిథులు. సుబ్ హానల్లాహ్. ఏమవుతుందండి అల్లాహ్ అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, అల్లాహ్ వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి, అల్లాహ్ పిలుపుని పురస్కరించుకొని వారు అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్ తో ఏమి అడిగితే అది అల్లాహ్ వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్ హానల్లాహ్.
మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి ఆతిథులుగా పిలిస్తే, దానిని మనం ఎంత గౌరవంగా భావిస్తాం, అవునా కాదా చెప్పండి? అబ్బా, రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరిపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండీ. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపుని పురస్కరించుకొని హజ్ చేయడానికి, ఉమ్రా చేయడానికి వెళితే, అల్లాహ్ దాసులు అల్లాహ్ అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు.
దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి, ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తో అడిగాను, నాకు కూడా అల్లాహ్ ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదేపదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూశాం. అయితే, కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు, అతను వెళ్లి అక్కడ అల్లాహ్ తో ధనం అడిగాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే, ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు, Mercedes-Benz లలో అతను తిరుగుతూ ఉన్నాడు, చూడండి అల్లాహ్ పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లాహ్ ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి, చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లాహ్ అతిథులు అవుతారు, అక్కడికి వెళ్లి అడిగితే అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు, అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా.
హజ్ మార్గంలో మరణించిన వారి పుణ్యం
అలాగే హజ్ గురించి మనం తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని, అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. రెండు ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి. సహీ అత్-తర్గిబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు:
ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్ లు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది. (సహీ అత్-తర్గిబ్ గ్రంథం)
“అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది” అని మరొక ఉల్లేఖనంలో ఉంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకునింది. బుఖారీ మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయటం జరిగింది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయటానికి సహబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడ్డాడు. గమనించండి. ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించటానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటె పైనుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహబాలకు ఈ విధంగా ఆదేశించారు:
“అతనికి రేగి ఆకులతో కలిపిన నీటితో స్నానం చేయించండి, అతని రెండు వస్త్రాలలోనే అతనికి కఫన్ చుట్టండి, అతని తలను కప్పకండి, అతనికి సుగంధం పూయకండి, ఎందుకంటే అతను ప్రళయం రోజున తల్బియా పఠిస్తూ లేపబడతాడు.”
అతనికి మీరు నీళ్ళలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్ళతో గుసుల్ చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో, అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి, అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే, ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్లీ రెండవ సారి నిలబెడతాడో, ఆ రోజు అతను
لَبَّيْكَ اللَّهُمَّ لَبَّيْكَ (లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్) “ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను”
అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో, వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్లీ రెండవ సారి లేపుతారో, ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్.
హజ్ లోని ప్రతి క్రియకు లభించే పుణ్యం
ఇక మిత్రులారా, హజ్ లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఇహ్రామ్ ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్లి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జమ్ జమ్ నీరు తాగుతాడు, సయీ చేస్తాడు, తలనీలాలు సమర్పించుకుంటాడు, అరఫా మైదానానికి వెళ్తాడు, ముజ్దలిఫాకు వెళ్తాడు, అలాగే కంకర్లు జమరాత్ కి కొడతాడు, తర్వాత తవాఫ్ లు చేస్తారు, సయీ చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా, మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా, దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించే వారు అడుగడుగునా, ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి.
ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి, దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండీ, “మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు.” అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు, అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో, అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “మీరు తవాఫ్ తర్వాత చదివే రెండు రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుని చేసిన దానికి సమానం అవుతుంది.” అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి,
“మీరు సఫా మర్వాల మధ్య చేసే సయీ 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానం అవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు: ‘చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్ని ఉన్నా, లేదా వర్షపు చినుకులన్ని ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్ని ఉన్నా వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేసాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేసాను.” అల్లాహు అక్బర్.
ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు: “ఆ తర్వాత మీరు జమరాత్ రాళ్ళు కొడితే, మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభువు అల్లాహ్ వద్ద మీ కోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీలాలు సమర్పించినప్పుడు అల్లాహ్ ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫ్ చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మపత్రాల్లో పాపాలు ఉండవో, అలా అయిపోతారు. తర్వాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు: వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి.” అల్లాహు అక్బర్.
మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తునికి దక్కుతున్నాయో చూడండి. తలనీలాలు సమర్పిస్తే, తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్ని పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే, లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా క్షమించేస్తాడు.
ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో, వారిని క్షమించడమే కాకుండా వారు ఎవరి కోసమైతే అక్కడ దుఆ చేస్తారో, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్యాబిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు కాబట్టి, ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, “ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి, ఏమండీ మా కోసం కూడా దుఆ చేయండి,” అని విన్నవించుకుంటారు, ఇందుకోసమే మిత్రులారా.
కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసే వారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు, వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించుకోబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పటివరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను.
హజ్ యాత్రికుల కొరకు ముఖ్యమైన సూచనలు
అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్ షా అల్లాహ్ నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను.
హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే:
స్తోమత ఉన్నప్పుడు హజ్ చేయడంలో ఆలస్యం చేయరాదు
స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు:
ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే, తెలియదు, ఆలస్యము చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే, మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరక్కపోవచ్చు. అలాగే వేరే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్లీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు.
కాబట్టి, సౌకర్యం దొరకగానే వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు కాబట్టి, హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు.
చాలామంది ఏమంటారంటే, “ముసలివాళ్ళం అయిపోయాక, బాగా వృద్ధ్యాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాం లేండి, ఇప్పుడే ఎందుకు తొందర ఎందుకు,” అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారెంటీ లేదు, అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారెంటీ లేదు, ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారెంటీ లేదు కాబట్టి, సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా.
అయితే, మనం సమాజంలో చూస్తూ ఉన్నాం, చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి, అయినా గానీ వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు చాలా కోపగించుకుని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి.
ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు: “ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్ కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో, అలాంటి వారిని గుర్తించి, వారి మీద ‘జిజ్యా’ ట్యాక్స్ విధించాలి. ఎందుకంటే, ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు” అని చెప్పారు.”
అల్లాహు అక్బర్. చూశారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు, వారి మీద జిజ్యా ట్యాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తాలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసి ఉంది సుమా.
ధర్మసమ్మతమైన (హలాల్) సంపాదనతోనే హజ్ చేయాలి
ఇక రెండవ సలహా ఏమిటంటే, హజ్ చేసేవారు ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు:
يَا أَيُّهَا النَّاسُ، إِنَّ اللَّهَ طَيِّبٌ، وَلَا يَقْبَلُ إِلَّا طَيِّبًا (యా అయ్యుహన్నాస్, ఇన్నల్లాహ తయ్యిబున్, వలా యఖ్బలు ఇల్లా తయ్యిబన్) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ పరిశుద్ధుడు, మరియు ఆయన పరిశుద్ధమైన దానిని తప్ప మరేదీ స్వీకరించడు.”
అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పరిశుద్ధుడు కాబట్టి ధర్మసమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు కాబట్టి హలాల్, ధర్మసమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం,
“ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము, ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి “యా రబ్బీ, యా రబ్బీ” (“ఓ నా ప్రభువా, ఓ నా ప్రభువా”) అని అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించినా, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే:
“అతని ఆహారం హరాం, అతని పానీయం హరాం, అతని వస్త్రం హరాం, మరియు అతను హరాంతో పోషించబడ్డాడు, కాబట్టి అతని ప్రార్థన ఎలా స్వీకరించబడుతుంది?“
అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది కాబట్టి అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుంది చెప్పండి? అన్నారు ప్రవక్త వారు. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు కాబట్టి జాగ్రత్త, ధర్మసమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి.
హజ్ సమయంలో గొడవలు మరియు అశ్లీలతకు దూరంగా ఉండాలి
అలాగే, మూడవ సలహా ఏమిటంటే, హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా కూడా తెలియజేశాడు, సూర బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు:
مَنْ حَجَّ فَلَمْ يَرْفُثْ وَلَمْ يَفْسُقْ، رَجَعَ كَمَا وَلَدَتْهُ أُمُّهُ (మన్ హజ్జ ఫలమ్ యర్ఫుస్ వలమ్ యఫ్సుఖ్ రజ’అ కమా వలదత్హు ఉమ్ముహు) “ఎవరైతే హజ్ చేసి, అసభ్యకరంగా మాట్లాడకుండా, పాపం చేయకుండా ఉంటాడో, అతను తన తల్లి గర్భం నుండి పుట్టిన రోజున ఉన్నట్లుగా తిరిగి వస్తాడు.”
ఎవరైతే హజ్ చేయడానికి వెళ్లారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో, అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో, వారి ఖాతాలో నుంచి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
జీవితంలో ఒక్కసారి హజ్ విధి
అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గలవారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్ ను చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ విధి అయింది అనటానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు:
يَا أَيُّهَا النَّاسُ، قَدْ فَرَضَ اللَّهُ عَلَيْكُمُ الْحَجَّ فَحُجُّوا (యా అయ్యుహన్నాస్, ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జూ) “ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీపై హజ్ ను విధిగా చేశాడు, కాబట్టి హజ్ చేయండి.”
ఒక వ్యక్తి లేచి, “ఓ దైవ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?” అన్నాడు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండవ సారి అడిగాడు, సమాధానం ఇవ్వలేదు. మూడు సార్లు అడిగినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే:
لَوْ قُلْتُ نَعَمْ لَوَجَبَتْ وَلَمَا اسْتَطَعْتُمْ (లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తత’తుమ్) “నేను అవును అని చెప్పి ఉంటే, అది విధిగా అయ్యేది, మరియు మీరు దానిని చేయలేకపోయేవారు.”
నేను అవును అని చెప్పేస్తే, మీ మీద విధి అయిపోతుంది, ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు, అది ‘నఫిల్’ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్ లు చేయవచ్చు, అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి, దువాలు స్వీకరించబడతాయి, కోరికలు తీర్చబడతాయి, అలాగే పేదరికము తొలగిపోతుంది, అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా, చేయవచ్చు కాకపోతే అది నఫిల్ అవుతుంది అన్న విషయాన్ని గుర్తించాలి.
వ్యాధిగ్రస్తుల తరఫున హజ్ చేయటం
అలాగే, ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరఫున వారసులు హజ్ చేయవచ్చు. అయితే, ముందు తమ తరఫున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలా మంది ప్రజల యొక్క తల్లిదండ్రులు లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు, మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరఫున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు కాకపోతే ముందు వారు వారి తరఫున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసామ్ తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, “ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది, కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, వాహనం మీద కూర్చోలేడు, కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరఫున హజ్ ఆచరించవచ్చునా?” అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, “అవును, చేయవచ్చు” అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు:
لَبَّيْكَ عَنْ شُبْرُمَةَ (లబ్బైక్ అన్ షుబ్రుమా) “ఓ అల్లాహ్, నేను షుబ్రుమా తరఫున హజ్ చేయడానికి హాజరయ్యాను” అని చెప్పాడు.
అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, “ఏమయ్యా, ముందు నువ్వు నీ తరఫున హజ్ చేసుకున్నావా?” అని అడిగితే అతను అన్నాడు, “లేదండీ ఓ దైవప్రవక్త,” అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
حُجَّ عَنْ نَفْسِكَ ثُمَّ حُجَّ عَنْ شُبْرُمَةَ (హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ షుబ్రుమా) “ముందు నీ తరపున హజ్ చెయ్యి, ఆ తర్వాత షుబ్రుమా తరపున హజ్ చెయ్యి.”
కాబట్టి మిత్రులారా, ఇక్కడ రెండు ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే వారి తరఫున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే, ముందు వారు, ఎవరైతే ఇతరుల తరఫున హజ్ ఉమ్రాలు చేస్తున్నారో, వారు ముందు వారి తరఫున హజ్ ఉమ్రాలు చేసుకొని ఉండాలి.
పసి పిల్లలకు హజ్ చేయించడం
అలాగే, చాలా మంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు కూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకుని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకుని వెళ్ళవచ్చునా అంటే, వెళ్ళవచ్చును, దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలు ఉన్నాయి.
ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము, ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, “ఓ దైవ ప్రవక్త, ఈ బిడ్డను కూడా నేను తీసుకుని వెళ్లి హజ్ ఉమ్రా చేయించవచ్చునా?” అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు:
نَعَمْ وَلَكِ أَجْرٌ (నఅమ్ వలకి అజ్ర్) “అవును, మరియు నీకు ప్రతిఫలం ఉంది.”
“నీవు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకుని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా దానికి ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు,” అని ప్రవక్త వారు తెలియజేశారు.
అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు, అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు. వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్లి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ పెరిగి పెద్దవారైపోతారు కదా, వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్తోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరఫున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్తోమత ఉండి కూడా, “నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారు, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారు,” అంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు, అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరఫున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు.
హజ్ లోని గుణపాఠాలు
ఇవి కొన్ని విషయాలండీ. ఇక హజ్ చేసే వాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండీ. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారు ఉంటారు. అలాగే ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు, సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టల్లో అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉంటాయి.
మొదటి విషయం ఏమిటంటే ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లాహ్ దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం.
అలాగే, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు, అల్లాహ్ ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉన్నారు అని సూచించడం జరుగుతూ ఉంది.
అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు, అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము “అల్లాహ్ అహద్, అల్లాహ్ అహద్” అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లాహ్ ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది.
అలాగే మిత్రులారా, చాలా విషయాలు ఉన్నాయండి, ఇన్ షా అల్లాహ్ వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే, అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తాడు, అల్లాహ్ నే వేడుకుంటాడు, అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా తోనే అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలినీ గుర్తుంచుకోడు, ఏ దర్గాని అక్కడ ఎవరూ గుర్తుంచుకోరు. వారందరి ముందర, వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన: అల్లాహ్ గృహం, మనం అల్లాహ్ తో మాట్లాడుతున్నాం, మనం అల్లాహ్ తో దుఆ చేసుకుంటున్నాం, మనం అల్లాహ్ ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాహ్ తోనే డైరెక్ట్ గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా భక్తులతో డైరెక్ట్ గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు, ఎవరి వాస్తా (మధ్యవర్తిత్వం) అవసరం లేదు, ఏ మరణించిన వ్యక్తి యొక్క వసీలా, వాస్తా భక్తునికి అవసరం లేదు, భక్తుడు కోరుకుంటే అల్లాహ్ డైరెక్ట్ గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది.
అలాగే, హజ్ ఉమ్రాలు ఆచరించే వారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకే ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ ఎనిమిదవ తేదీన ఉండాలంటే ఎనిమిదవ తేదీనే ఉంటారు. తొమ్మిదవ తేదీన అలా ఉండాలంటే అక్కడే తొమ్మిదవ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండీ? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్ళరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి కదా, ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే ప్రవక్త వారి విధానానికి విరుద్ధం అని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించటం భక్తుని యొక్క కర్తవ్యం అన్న విషయం కూడా బోధించబడుతుంది.
ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి అవన్నీ విషయాలు బోధపడతాయి కాబట్టి నేను అల్లాహ్ తో దుఆ చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్ లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించు గాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్యాబిడ్డలతో కూడా వెళ్లి హజ్ లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ ప్రసాదించు గాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్ హాన వ త’ఆలా మనందరికీ కలిగించు గాక.ఆమీన్
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు [పార్ట్ 4] [మరణానంతర జీవితం – పార్ట్ 58] [26 నిముషాలు] https://www.youtube.com/watch?v=rtI9WoN-uuo వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, వక్త ఇస్లాంలో నరకం (జహన్నం) యొక్క తీవ్రతను, దాని అగ్ని మరియు శిక్షల గురించి వివరిస్తారు. నరకంలో మరణం అనేది ఉండదని, శిక్ష నిరంతరంగా మరియు తీవ్రంగా ఉంటుందని, అది ఎముకలను మరియు హృదయాలను తాకుతుందని స్పష్టం చేస్తారు. నరకాగ్ని, దాని నిప్పురవ్వలు, నివాసుల హింస, వారు తాగే బాధాకరమైన పానీయాలు మరియు నీడలేని నీడ గురించి ఖురాన్ ఆయతులను ఉటంకిస్తారు. కృతజ్ఞత లేకపోవడం మరియు ఇతరులను శపించడం వంటివి నరకంలో స్త్రీలు అధిక సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, ఈ దుర్గుణాలు ఎవరినైనా నరకానికి దారితీస్తాయని నొక్కి చెబుతారు. ఈ ప్రపంచం యొక్క తాత్కాలిక స్వభావాన్ని పరలోకం యొక్క శాశ్వత వాస్తవికతతో పోలుస్తూ, శ్రోతలను అల్లాహ్కు భయపడాలని, పాపాలను విడిచిపెట్టాలని, మరియు ఖురాన్ మరియు ప్రవక్త మార్గదర్శకత్వం అనుసరించి పరలోకం కోసం సిద్ధం కావాలని ప్రబోధిస్తారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లాహి వహ్దహు వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బ’అదహు, అమ్మా బ’అద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం.
మహాశయులారా, నరకం, నరకవాసులు, నరకం యొక్క శిక్షలు. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. నరకం, దాని యొక్క వేడి ఎలా ఉంటుంది? నరకం దాని వేడితో అందులో పడే నరకవాసులను ఎలా శిక్షిస్తుంది? దానిని వివరిస్తూ అల్లాహ్ త’ఆలా ఎన్నో రకాలు దాని గురించి తెలిపాడు. ఈ రకాలు ఏదైతే తెలిపాడో, దానివల్ల మనలో భయం ఏర్పడి, మనం ఆ నరకం నుండి రక్షింపబడుటకు ప్రయత్నాలు చేయాలి.
సామాన్యంగా ఈ రోజుల్లో ఎవరినైనా అడగండి, నరకంలో వేసిన తర్వాత ఏమవుతుంది అంటే, మనిషి కాలి బూడిదైపోతాడు అని అంటారు. కానీ నరకాగ్ని అలాంటిది కాదు. అది మనిషిని కాల్చడంలో ఎంత వేగం, దాని యొక్క శిక్షలో ఎంత కఠినత్వం మరియు దానివల్ల మనిషికి కలిగే బాధ ఎంత ఘోరంగా ఉంటుందో, మరో విచిత్రకరమైన విషయం ఏంటంటే, ఆ శిక్షలో, ఆ నరకాగ్నిలో మనిషికి చావు అన్నది రాదు. అందులో మనిషి కాలి బూడిదైపోడు. అలా కావడానికి ఏ మాత్రం అవకాశం లేదు.
నరక శిక్షల గురించి అల్లాహ్ త’ఆలా ఏ ఏ ఆయతులైతే అవతరింపజేశాడో, వాటిలో కొన్ని ఆయతులు మాత్రమే మనం చదివి వాటి అర్థభావాలను తెలుసుకుందాము. వాటి ద్వారా నరక శిక్ష యొక్క వేడిని, దాని యొక్క గాంభీర్యతను తెలుసుకోవడంతో పాటు, ఏ పాపాల వల్ల అలాంటి శిక్ష ఇవ్వడం అనేది జరుగుతుందో, ఆ పాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం కూడా మనం చేద్దాము.
నరకాగ్ని యొక్క తీవ్రత
నరకాగ్ని ఎంత శిక్షాపరమైనదంటే, కేవలం మనిషి చర్మాన్నే కాల్చివేయదు. దాని యొక్క వేడి, అగ్ని ఎముకలకు చేరుకుంటుంది. అంతేకాదు, హృదయం లోపలి భాగంలో కూడా అది చేరుకుంటుంది. అంతేకాదు, అగ్ని మనిషి యొక్క నోటి వరకు వచ్చినా, దాని మూలంగా కడుపులో దాని యొక్క బాధ, అవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇంతకుముందే మనం ఒక కార్యక్రమంలో విన్నాము, అతి తక్కువ శిక్ష ఎవరికైతే నరకంలో ఇవ్వబడుతుందో, దాని యొక్క రకం ఏమిటి? నరకపు బూట్లు ధరింపచేయడం జరుగుతుంది, దానివల్ల అతని యొక్క మెదడు ఉడుకుతున్నట్లుగా అతనికి ఏర్పడుతుంది.
ప్రపంచపు అగ్నిలో ఎప్పుడైనా అది ఎముకల వరకు చేరుతుంది, హృదయం లోపలి వరకు చేరుతుంది, కడుపు లోపలి వరకు చేరుతుంది, ఇలాంటి విషయాలు వింటామా? సోదరులారా, నరకం గురించి ఇన్ని వివరాలు అల్లాహ్ మనకు తెలిపాడు అంటే, అన్ని రకాల పాపాలను, అన్ని రకాల చెడుగులను మనం వదులుకోవాలని.
సూరె ఘాషియాలో,
وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ (వుజూహున్ యౌమఇజిన్ ఖాషిఅహ్) ఆ రోజు ఎన్నో ముఖాలు అవమానంతో పాలిపోయి ఉంటాయి.(88:2)
عَامِلَةٌ نَّاصِبَةٌ (ఆమిలతున్ నాసిబహ్) శ్రమిస్తూ, అలసి సొలసి ఉంటాయి. (88:3)
ఎన్నో ముఖాలు, వారి ముఖాలు క్రిందికి వాలి ఉంటాయి, వంగి ఉంటాయి. వారు ఇహలోకంలో ఎంతో కష్టపడేవారు. అలసిపోయి అలసిపోయి ఎన్నో మేము పుణ్యాలు చేసుకున్నాము అని సంతోషపడేవారు. కానీ ప్రవక్త విధానంలో లేనందుకు, అల్లాహ్ యొక్క సంతృప్తి కొరకు లేనందుకు ఏం జరిగింది? తస్లా నారన్ హామియా. ఆ పుణ్యాలన్నీ కూడా వృధా అయిపోయినాయి మరియు వారు తస్లా, నరకంలో చేరారు. ఎలాంటి నరకం? హామియా, అది మండుతూ ఉంటుంది.
మరోచోట సూరతుల్ లైల్ లో అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్,
فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ (ఫ అన్-జర్తుకుమ్ నారన్ తలజ్జా) మరి నేను మటుకు నిప్పులు చెరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను.(92:14)
అని తెలియపరిచాడు. ఆ నరకాగ్ని ఎలాంటిది? నారన్ తలజ్జా. నిప్పులు చెరిగే ఆ నరకాగ్ని నుండి నేను మిమ్మల్ని హెచ్చరించలేదా? ఇంకా ఆ నరకాగ్ని భగభగ మండుతూ ఉంటుంది, మంటలు లేస్తూ ఉంటాయి. దాని యొక్క జ్వాలలతోనే మనిషికి ఎంతో దూరం నుండి వాటి యొక్క వేడి తలుగుతూ ఉంటుంది.
తబ్బత్ యదా అబీ లహబివ్ వతబ్. మా అగ్నా అన్హు మాలుహు వమా కసబ్. అబూ లహబ్ అతని చేతులు విరిగిపోవు గాక, అతను సర్వనాశనమయ్యాడు. అతను సంపాదించిన సంపద మరియు అతని యొక్క డబ్బు, ధనం అతనికి ఏమీ ప్రయోజనం కలిగించలేదు.
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ (సయస్లా నారన్ జాత లహబ్) త్వరలోనే వాడు భగ భగ మండే అగ్నికి ఆహుతి అవుతాడు. (111:3)
గమనించండి ఇక్కడ. నారన్ హామియా, నారన్ తలజ్జా, నారన్ జాత లహబ్. నార్, ఆ అగ్ని, నరకం దాని యొక్క గుణాలు ఈ విధంగా తెలుపబడుతున్నాయి. ఇక్కడ జాత లహబ్, అందులో భగభగ మండుతూ ఉంటుంది, దాని యొక్క మంటలు, దాని యొక్క జ్వాలలు మహా భయంకరంగా ఉంటాయి.
ఈ విధంగా మహాశయులారా, అంతటి కఠిన శిక్ష గల ఆ నరకం మరియు ఆ నరకాగ్ని యొక్క ఇలాంటి రకరకాల గుణాలు వాటితో రక్షణ పొందడానికి ఏముంది మన వద్ద?
الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ (అల్లతీ తత్తలివు అలల్ అఫ్-ఇద) అది హృదయాల వరకూ చొచ్చుకు పోయేటటువంటిది. (104:7)
అని ఒకచోట తెలపడం జరిగింది. ఆ నరకం, నరకాగ్ని మనిషి యొక్క హృదయాల వరకు చేరుతుంది. మరియు ఆ నరకాగ్ని అందులో ఏ నిప్పులైతే లేస్తాయో, అగ్ని యొక్క నిప్పులు ఏవైతే లేసి వేరేచోట పడతాయో, వాటి గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఆ నిప్పులు ఎంత పెద్దగా ఉంటాయో, దాని యొక్క వివరణ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సూరతుల్ ముర్సలాత్లో అల్లాహ్ త’ఆలా తెలిపాడు,
ఆ నరకం ఎలాంటి నిప్పులను పడవేస్తుందంటే, ఆ నిప్పులు పెద్ద పెద్ద బిల్డింగుల మాదిరిగా, మహా గొప్ప కోటల మాదిరిగా, అంత పెద్దగా ఒక్కొక్క నిప్పు ఉంటుంది. అల్లాహు అక్బర్! ఆ నిప్పు అంత భయంకరమైన, ఘోరమైన, అంత పెద్దగా ఉంటుంది అంటే, ఇక ఆ నరకాగ్ని ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.
ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు,
“నారుకుమ్ హాజిహిల్లాతీ యూఖిదు ఇబ్ను ఆదమ్, జుజ్ఉమ్ మిన్ సబ్ఈన జుజ్ఇన్ మిన్ హర్రి జహన్నమ్”. ఇహలోకంలో మనిషి ఏ అగ్నినైతే కాలుస్తున్నాడో, అది నరకపు అగ్నిలో 70 భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం.
సహాబాలకు చాలా ఆశ్చర్యం కలిగింది. సహాబాలు చెప్పారు, “ప్రవక్తా, మనిషిని కాల్చడానికి ఈ ఇహలోకపు అగ్నియే చాలు కదా?” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఆ నరకాగ్ని ఇహలోకపు అగ్ని కంటే “ఫుద్విలత్ బి తిస్ఇన్ వసిత్తీన జుజ్ఆ”, 69 రేట్లు ఎక్కువగా అది ఇంకా వేడిగా ఉంటుంది. మరి గమనించండి, ఈ ఇహలోకపు అగ్నియే మనిషిని కాల్చడానికి సరిపోతుంది అని అనుకునే వాళ్ళం మనం, ఇంతకంటే 69 రేట్లు ఎక్కువగా వేడి ఉన్న ఆ నరకాగ్ని నుండి రక్షింపబడడానికి ఏం చేస్తున్నాము?
నరకంలో ఉపశమనం లేదు
మహాశయులారా, మనిషి వేడిలో, ఎండకాలంలో ఏదైనా ప్రశాంతత పొందడానికి, నీడ పొందడానికి, చల్లదనం పొందడానికి ఎక్కడికి వెళ్తాడు? ఏదైనా చెట్టు కింద నీడ పొందాలని, అక్కడ హాయిగా గాలి వీస్తూ ఉండాలని, త్రాగడానికి చల్లటి నీళ్లు అతనికి లభించాలని కోరుకుంటాడు. అవునా కాదా? మనందరి పరిస్థితి ఇదే కదా?
కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అందులో అతనికి ఎండలో పని చేస్తూ చేస్తూ చెమటలు కారుతూ, శక్తి క్షీణించిపోయినట్లుగా ఏర్పడుతుంది. కొంతసేపటి గురించైనా నీడలోకి వెళ్లి, గాలి వీస్తున్నచోట కూర్చుండి, ప్రశాంతత తీసుకొని అక్కడ త్రాగడానికి చల్లటి నీరు లభించిందంటే, అతనికి ఓ స్వర్గం లభించింది అన్నట్టుగా భావిస్తాడు.
కానీ నరకంలో ఉన్నవారు నరక శిక్షను భరిస్తూ భరిస్తూ సహించలేక, ఓపిక వహించలేక, చావు వచ్చి చనిపోతే బాగుండు అని కోరుతూ ఉంటారు. అయినా అక్కడ చావు రావడానికి ఏ మాత్రం అవకాశం లేదు. అప్పుడు వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది.
انطَلِقُوا إِلَىٰ ظِلٍّ ذِي ثَلَاثِ شُعَبٍ (ఇన్-తలిఖూ ఇలా జిల్లిన్ జీ సలాసి షుఅబ్) “మూడు పాయలుగా చీలిన ఆ నీడ వైపు పదండి!!” (77:30)
لَّا ظَلِيلٍ وَلَا يُغْنِي مِنَ اللَّهَبِ (లా జలీలిన్ వలా యుగ్నీ మినల్ లహబ్) నిజానికి అది మీకు నీడనూ ఇవ్వదు, అగ్ని జ్వాలల నుండి మీకు రక్షణనూ ఇవ్వదు. (77:31)
అక్కడ వారికి ఒక నీడ లాంటిది కనబడుతుంది. ఆ నీడలో వెళ్దాము అని వారు అక్కడికి వెళ్తారు. అల్లాహు అక్బర్! ఆ నీడ కూడా ఎలాంటిది? ఆ నీడ నరకాగ్ని యొక్క నీడ. మనిషి కొంతపాటు విశ్రాంతి తీసుకుందామని ఆ నీడలోకి వెళ్ళినప్పుడు, నరకం నుండి పెద్ద పెద్ద నిప్పులు వచ్చి పడతాయి. ఒక్కొక్క నిప్పు ఒక పెద్ద పర్వతం మాదిరిగా, పెద్ద కోట మాదిరిగా, ఓ మహా పెద్ద ప్యాలెస్ మాదిరిగా ఉంటుంది.
ఇక ఆ నీడతో అతనికి ఏం ప్రయోజనం కలిగింది? చల్లని గాలి వస్తుందేమో అని అక్కడ ఆశిస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? సూరె వాఖిఆలో అల్లాహ్ త’ఆలా దాని గురించి ప్రస్తావించాడు. నరకం, నరకపు అగ్ని, దాని యొక్క వేడి, దాని యొక్క రకాలు, గుణాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాము. నరకాగ్ని శిక్షను మనిషి భరించలేక నీడ చూస్తాడు, ఆ నీడలో కొంత విశ్రాంతి తీసుకుందామని వస్తాడు, కానీ ఆ నీడ నరకపు అగ్ని యొక్క నీడ. అందులో ఎలాంటి ప్రశాంతత అనేది ఉండదు. పైగా నరకపు నిప్పులు వచ్చి పడుతూ ఉంటాయి. ఒక్కొక్క నిప్పు ఎంతో పెద్ద ప్యాలెస్ గా, పెద్ద కోట మాదిరిగా ఉంటుంది.
ఏమైనా గాలి వీస్తుందో ఏమో, ఆ గాలి ద్వారా కొంచెం ఏదైనా లాభం పొందుదాము అని కోరుతాడు. కానీ అది ఎలాంటిది? మీ యహ్మూమ్ అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తెలిపాడు. గాలి వీస్తుంది, కానీ ఆ గాలి ఎలాంటిది? అందులో కూడా విపరీతమైన వేడి, పొగ మరియు ఆ దానిని మనిషి ఏ మాత్రం భరించలేడు. ఎందుకైతే నేను ఆ నరకం నుండి బయటికి వచ్చాను, ఇక్కడి కంటే అక్కడే బాగుండే కదా అని అప్పుడు మనిషి భావిస్తాడు. ఈ విధంగా స్థలాలు మార్చినా, ఒక స్థితి నుండి మరో స్థితికి వచ్చినా, నరకపు అగ్ని అనేది, నరకపు శిక్ష అనేది తగ్గదు.
ఇక ఏదైనా నీరు త్రాగాలి అని అనిపిస్తుంది. అప్పుడు అతనికి మరీ దాహం కలిగి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వబడుతుందో, లా బారిదిన్ వలా కరీమ్. అది చల్లగా ఉండదు మరియు అతిథికి గౌరవ మర్యాదలు ఇస్తూ ఎలాగైతే ఒక వస్తువు త్రాగడానికి, తినడానికి ఇవ్వడం జరుగుతుందో అలా జరగదు. సూరె కహఫ్ లో చదవండి.
ఒకవేళ వారు సహాయం (ఉపశమనం, నీళ్లు) అడిగితే, నూనె మడ్డిలాంటి నీటితో వారికి సహాయం అందజేయబడుతుంది. అది ముఖాలను మాడ్చివేస్తుంది. అత్యంత అసహ్యకరమైన నీరు అది! అత్యంత దుర్భరమైన నివాసం (నరకం) అది!!. (18:29)
దాహం కలుగుతుంది, మాకు నీళ్ళు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి అని వారు కోరుతారు. అప్పుడు వారికి త్రాగడానికి ఏ నీరైతే ఇవ్వడం జరుగుతుందో, దానిని దగ్గరికి తీసుకుంటే యష్విల్ వుజూహ్, త్రాగకముందే కేవలం దగ్గరికి తీసుకున్నంత మాత్రాన ముఖమంతా కాలిపోతుంది. అల్లాహు అక్బర్! దాన్ని చూసి ఏమంటాడు? బిఅసష్షరాబ్! ఇది ఎంత చెడ్డ నీరు, త్రాగడానికి ఇవ్వబడిన ఈ పదార్థం ఎంత చెడ్డది అని అక్కడ భావిస్తాడు. అల్లాహు అక్బర్! కానీ ఈ రోజుల్లో ఆ నరకం నుండి రక్షణ పొందడానికి ఏ పాపాల నుండి అయితే మనం దూరం ఉండాలో, ఆ పాపాలలో ఎంతో ఆనందిస్తున్నాడు. అల్లాహు అక్బర్! ఇలాంటి జీవితం మనిషిది గమనించండి. అందుగురించి అల్లాహ్ త’ఆలా ఖురాన్ లాంటి దివ్య గ్రంథాన్ని మనకు ప్రసాదించి, దీన్ని చదవడం ద్వారా, దీనిని మనం గ్రహించడం ద్వారా ఇలాంటి పాపాల నుండి దూరం ఉండి రేపటి రోజు ఆ నరక శిక్షల నుండి కూడా మనం రక్షింపబడగలుగుతాము.
నరకంలో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది?
మహాశయులారా, నరకం, అందులో అతి ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది? నరకం ఎవరి స్థానం అవుతుంది? దీని గురించి హదీసుల్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా తెలిపారు. పురుషుల కంటే ఎక్కువ సంఖ్య నరకంలో స్త్రీలది ఉంటుంది అని తెలిపారు. అయితే ఇక్కడ స్త్రీలను అగౌరవపరచడం కాదు, కొన్ని రకాల గుణాలు తెలపడం జరిగింది. వారిలో ఆ చెడు గుణాలు ఎక్కువ ఉన్నందుకు వారు ఎక్కువగా నరకంలో ఉంటారు అని తెలపడం జరిగింది. ఒకవేళ అలాంటి గుణాలు పురుషుల్లో ఉంటే, వారు కూడా నరకంలో ఉంటారు.
ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “ఇన్నీ రఐతు అక్సర అహ్లిన్నారి అన్నిసా”. నేను నరకంలో అధిక సంఖ్య స్త్రీలది చూశాను అని చెప్పారు. స్త్రీలలో నుండి ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, ఎందుకు, కారణం చెప్పగలుగుతారా?” ఉద్దేశం ఏమిటి? కారణం తెలిస్తే అలాంటి కారణాలు మా ద్వారా సంభవించకుండా మేము జాగ్రత్త పడగలము. ఆనాటి కాలంలో సహాబాలు గాని, సహాబాల యొక్క భార్యలు, సహాబియాత్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా శిక్ష గురించి హెచ్చరిస్తున్నారు అంటే, ఇలా ఎందుకు అని వారు కారణం అడిగితే వారి ఉద్దేశం ఏముండేది? అలాంటి పాపాల నుండి దూరం ఉండాలి అని.
ఎక్కడైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శుభవార్త తెలుపుతున్నారు, “అలా అదుల్లుకుమ్ అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా”, మీ పాపాలు ఎలా మన్నించబడాలి, మీ స్థానాలు ఎలా రెట్టింపు చేయబడాలి అని ఇలాంటి శుభవార్తలు ఏదైనా ఇస్తున్నప్పుడు, “తప్పక తెలపండి, ఆ విషయాలు ఏమిటి?” అని అడిగేవారు. ఎందుకు? అలాంటి సత్కార్యాలు చేసుకోవాలని. అల్లాహ్ మనలోని ప్రతి ఒక్కరిని క్షమించు గాక, ఈ రోజుల్లో మనలో అనేకమంది అలవాటు ఏమైంది? చెడు గుణం గురించి ఏదైనా, శిక్ష గురించి ఏదైనా హెచ్చరిక ఇవ్వబడుతున్నప్పుడు, అడ్డ ప్రశ్నలు వేసి, ఆ శిక్షకు కారణమయ్యే పాపాల నుండి దూరం ఉందాము అన్నటువంటి ఆలోచన లేకుండా, ఇంత పాపానికి ఇంత పెద్ద శిక్షనా? ఇలాంటి పాపాలు మన్నించబడవా? ఇలాంటి పాపాలు చేసిన తర్వాత ఏదైనా .. ప్రశ్నలు వేస్తూ ఉంటారు కానీ, వాటి నుండి మనం దూరం ఉందాము మరియు దానికి సబబు ఏదైతే శిక్ష అవుతుందో, ఆ శిక్ష నుండి మనం తప్పించుకునే ప్రయత్నం చేద్దాము అన్నటువంటి ఆలోచన కలగటం లేదు.
మరోవైపు పుణ్యకార్యాల గురించి శుభవార్త ఇవ్వడం జరిగినప్పుడు, ఇది కూడా చేయడం తప్పనిసరియా? చేయకుంటే నడవదా? అన్నటువంటి ప్రశ్నలు అక్కడ. అల్లాహ్తో భయపడాలి మనం. ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, మీకంటే ముందు గతించిన జాతి వారు వినాశనానికి గురి అయ్యే కారణాల్లో ఒక కారణం, ప్రవక్తలు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండడం మరియు అధికంగా అనవసరమైన ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉండడం.
అందుగురించి మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే తెలిపారో, నేను నరకంలో అధిక సంఖ్యలో స్త్రీలను చూశాను అని, ఒక స్త్రీ నిలబడి, “ప్రవక్తా, కారణాలు ఏంటి?” అని అడిగితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, “యక్సుర్నల్ లఅన్, వ యక్ఫుర్నల్ అషీర్”. వారి నోట మాటిమాటికి శాపనార్థాలు వెళ్తూ ఉంటాయి. వారు ఎక్కువగా శపిస్తూ ఉంటారు మరియు తమ భర్తలకు వారు కృతజ్ఞత చెల్లించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది.
భర్తలకు ఆదేశం ఇవ్వడం జరిగింది, “ఖియారుకుమ్ ఖియారుకుమ్ లి అహ్లిహి, వ అన ఖైరుకుం లి అహ్లీ”. మీలో అందరికంటే మేలైన వాడు తమ ఇల్లాలి పట్ల, తమ ఇంటి వారి పట్ల అతి ఉత్తమంగా మెలిగేవాడు అని. మరియు నేను మీ అందరిలోకెల్లా ఉత్తమమైన వాడిని, నేను నా ఇల్లాలి పట్ల, ఇంటి వారి పట్ల ఉత్తమ వైఖరి అవలంబిస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు. అటువైపున భర్తలకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే భార్యలకు కూడా భర్త హక్కు ఏమిటో, భర్త జీవితాంతం మేలు చేసుకుంటూ వస్తాడు, కానీ ఒక్కసారి భార్య యొక్క కోరిక ఏదైనా నెరవేర్చక పోవడంలో, “జీవితంలో ఎప్పుడూ కూడా నీతో సుఖం పొందలేదు నేను” అని భార్య అంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వివరణ ఇచ్చారు. అయితే, ఇలాంటి చెడు గుణం కొందరి భర్తల్లో కూడా ఉంది. వారు కూడా తమ చెడు గుణాన్ని దూరం చేసుకోవాలి. భార్యతో ఎంత ఆనందం పొందినా, ఎంత సుఖం పొందినా, ఒక్కసారి కూడా నీతో నేను సుఖం పొందలేదు అన్నటువంటి మాటలు కూడా మాట్లాడతారు.
మహాశయులారా, నరకానికి కారణమయ్యే ఇలాంటి దుర్గుణాల నుండి, దురలవాట్ల నుండి, చెడు కార్యాల నుండి మనం దూరం ఉండే ప్రయత్నం చేయాలి.
నరకవాసుల సంఖ్య
ఇక్కడ ఒక విషయం తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదేమిటంటే, నరకవాసుల సంఖ్య స్వర్గవాసుల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటుంది అని. అయితే, ఇలా ఎందుకు జరుగుతుంది అని వచ్చిన ప్రశ్నకు ధర్మవేత్తలు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ప్రజలు ప్రపంచపు వ్యామోహంలో కూరుకుపోయి ప్రవక్తలు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించరు గనక వారు నరకంలో పడిపోతారు.
మరి ఏ జాతి వారి వద్దకు కూడా అల్లాహ్ త’ఆలా తన ప్రవక్తని లేదా ప్రవక్త కాలం అంతమైపోయిన తర్వాత, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకంలో నుండి చివరి ప్రవక్తగా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వారి స్థానంలో, అంటే వారి లాంటి దావా కార్యక్రమం చేస్తూ ఉన్న వారిని ఎవరినొకరినైనా అల్లాహ్ త’ఆలా ఏదైనా సమాజంలో పంపి ఉంటాడు. ఆ తర్వాతనే వారిపై శిక్ష విధిస్తాడు.
وَمَا كُنَّا مُعَذِّبِينَ حَتَّىٰ نَبْعَثَ رَسُولًا (వమా కున్నా ముఅజ్జిబీన హత్తా నబ్-అస రసూలా) ఒక ప్రవక్తను పంపనంతవరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు. (17:15)
ఏ ప్రవక్తను పంపనిది మేము ఏ జాతిని శిక్షించము అని అల్లాహ్ త’ఆలా అంటున్నాడు. ఇక ఏ జాతి పైనైనా ఏదైనా శిక్ష వచ్చి పడుతుంది అంటే, ఆ జాతి వారికి హెచ్చరిక ఇవ్వడం జరిగింది. ఏదో ఒక రకంగా. కానీ దానిని వారు పెడచెవిన పెట్టారు, దానిని స్వీకరించలేదు, దానిని అర్థం చేసుకోలేకపోయారు. అందుగురించి వారు శిక్షను అనుభవించాల్సి వచ్చింది.
మహాశయులారా, మనిషిలో ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏమిటంటే, అతను దూరపు ఆలోచన తక్కువ, ప్రవక్తల ద్వారా లేక అల్లాహ్ మార్గం వైపునకు పిలిచే అటువంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో, వారు ఖురాన్ ఆధారంగా ఏ సత్య బోధన చేస్తున్నారో, ఆ సత్య బోధనలో ఉన్నటువంటి లాభాలను గ్రహించరు. తొందరపాటు పడి, ప్రపంచ వ్యామోహంలో పడి, ప్రస్తుత లాభాన్ని పొందడంలో వారు నిమగ్నులై ఉంటారు. దాని మూలంగా పరలోక జీవితాన్ని మరిచిపోతూ ఉంటారు. అందుగురించి ఎన్నో సందర్భాల్లో అల్లాహ్ త’ఆలా ఖురాన్లో స్పష్టంగా తెలిపాడు,
كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ (కల్లా బల్ తుహిబ్బూనల్ ఆజిల) ఎన్నటికీ కాదు. మీరసలు తొందరగా లభించే దాని (ప్రపంచం)పై మోజు పడుతున్నారు.(75:20)
وَتَذَرُونَ الْآخِرَةَ (వ తజరూనల్ ఆఖిర) పరలోకాన్ని మాత్రం వదలిపెడుతున్నారు.(75:21)
మీరు ప్రపంచాన్ని అధికంగా ప్రేమిస్తున్నారు, మరియు మీ వెనక ఉన్నటువంటి ఆ పరలోకాన్ని మరిచిపోతున్నారు. ఇలా ప్రపంచ వ్యామోహంలో పడి, తాత్కాలికపు లాభాలు, ప్రయోజనాల గురించి ఎక్కువగా ఆలోచించి, దూరమున ఉన్న ఆ పరలోకం మహా దూరం ఉంది కదా అని భావించి, దాని విషయంలో ఏ సంసిద్ధత ముందు నుండే ఉండాలో, దానిని పాటించనందుకు, అధిక సంఖ్యలో ప్రజలు నరకంలో పోవడానికి కారణమవుతుంది.
ఇప్పటికైనా అల్లాహ్ మనకు అవకాశం ఇచ్చాడు. మన ప్రాణం పోకముందే ఇలాంటి మంచి బోధనలు వినడానికి మనకు అవకాశం కలుగజేస్తున్నాడు. ఇకనైనా నరకంతో మనం భయపడాలి, దానికి కారణమయ్యే పాపాల నుండి మనం దూరం ఉండాలి, మరియు ఎల్లవేళల్లో అల్లాహ్తో భయపడుతూ, అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నరకం నుండి రక్షింపబడతాము.
సూరె జుఖ్రుఫ్, ఆయత్ నంబర్ 23, 24 లో అల్లాహ్ త’ఆలా ఎంత స్పష్టంగా ప్రజల యొక్క ఈ చెడు భావాన్ని తెలిపి వారికి గుణపాఠం వచ్చే విధంగా చేశాడు, గమనించండి.
మా అర్సల్నా మిన్ ఖబ్లిక ఫీ ఖర్యతిన్ మిన్ నజీరిన్ ఇల్లా ఖాల ముత్రఫూహా. మేము మీకంటే ముందు, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు, మీకంటే ముందు ఏ బస్తీలో, ఏ హెచ్చరిక చేసేవానిని మేము పంపినా, ఆ బస్తీలో, ఆ నగరంలో ఉన్నటువంటి సిరివంతులు, ఆనందంలో జీవితం గడుపుతున్న వారు ప్రవక్తలతో ఏమన్నారు?
“మీ తాతముత్తాతలు అనుసరిస్తుండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని (గమ్యానికి చేర్చే మార్గాన్ని) నేను మీ వద్దకు తీసుకువచ్చాను” అని (దైవప్రవక్త) అన్నప్పుడు, (43:24)
మీ తాతముత్తాతల కంటే ఎక్కువ సన్మార్గం, ఉత్తమ మార్గం నేను మీకు చూపినా మీరు తిరస్కరిస్తారా? అంటే వారు స్పష్టంగా ఏం చెప్పారు?
قَالُوا إِنَّا بِمَا أُرْسِلْتُم بِهِ كَافِرُونَ
దానికి వారు, “మీకిచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం” అని వాళ్లు (తెగేసి) చెప్పారు. (43:24)
మీరు ఏ ధర్మమైతే తీసుకొచ్చారో, ఏ సత్యమైతే తీసుకొచ్చారో, వాటిని మేము తిరస్కరిస్తున్నాము. అల్లాహు అక్బర్! ఈ విధంగా ప్రజలు పెడమార్గంలో పడిపోతారు. అల్లాహ్ త’ఆలా నరకంలోకి తీసుకెళ్లే ప్రతి చెడు కార్యం నుండి మనల్ని దూరం ఉంచు గాక. నరకం నుండి అల్లాహ్ మనందరికీ రక్షణ కలిగించు గాక. వా ఆఖిరు ద’అవాన అనిల్ హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
త్రాసును తేలికగా చేసే పాప కార్యాలు(2) [మరణానంతర జీవితం – పార్ట్ 43] https://www.youtube.com/watch?v=rhP9srQxkjE [20 నిముషాలు] వక్త: ముహమ్మద్ నసీరుద్దీన్ జామి’ఈ (హఫిజహుల్లాహ్)
ఈ ప్రసంగంలో, సత్కార్యాల త్రాసును తేలికపరిచే దుష్కార్యాల గురించి వివరించబడింది. ఇందులో ప్రధానంగా షిర్క్ (బహుదైవారాధన), దాని తీవ్రత, మరియు అది సత్కార్యాలను ఎలా నాశనం చేస్తుందో ఖురాన్ ఆయతుల ఆధారంగా చర్చించబడింది. షిర్క్తో మరణిస్తే అల్లాహ్ క్షమించడని, అయితే బ్రతికి ఉండగా పశ్చాత్తాపపడితే (తౌబా) క్షమించబడతాడని స్పష్టం చేయబడింది. ఆ తర్వాత, సత్కార్యాలను నాశనం చేసే అవిశ్వాసం (కుఫ్ర్) మరియు ధర్మభ్రష్టతకు (రిద్దత్) దారితీసే మూడు ప్రధాన కార్యాలు వివరించబడ్డాయి: 1) ధర్మాన్ని, ధర్మాన్ని పాటించే వారిని ఎగతాళి చేయడం. 2) అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకోవడం. 3) అల్లాహ్కు ఇష్టం లేని వాటిని అనుసరించి, ఆయనకు ఇష్టమైన వాటిని ద్వేషించడం. ఈ పాపాల వల్ల సత్కార్యాలు నిరర్థకమైపోతాయని హెచ్చరించబడింది.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హందులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా అమ్మాబాద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు స్వాగతం.
త్రాసును తేలికగా చేసే దుష్కార్యాల గురించి మనం వింటున్నాము. ఇందులో మొదటి విషయం, సర్వ సత్కార్యాలు నశింపజేసే దుష్కార్యం షిర్క్. షిర్క్ ఎంత ఘోరమైన పాపం అంటే, ఇదే స్థితిలో గనక ఎవరైనా చనిపోతే అల్లాహు త’ఆలా ఎన్నటికీ అతన్ని క్షమించడు మరియు అతనిపై శాశ్వతంగా స్వర్గం నిషిద్ధమైపోతుంది. మనిషి తప్పకుండా ప్రతీ రకమైన షిర్క్ నుండి తౌబా చేయాలి. అల్లాహ్కు అత్యంత అసహ్యకరమైన పాపం అంటే ఇదే.
అల్లాహ్ సూరె నిసా ఆయత్ నెంబర్ 48 లో షిర్క్ గురించి ఇలా హెచ్చరించాడు.
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ [ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్ఫిరు మాదూన దాలిక లిమన్ యషా] తనకు భాగస్వామిగా మరొకరిని కల్పించటాన్ని (షిర్కును) అల్లాహ్ సుతరామూ క్షమించడు. ఇది తప్ప ఆయన తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు. (4:48)
నిశ్చయంగా అల్లాహు త’ఆలా ఆయనతో పాటు మరొకరిని భాగస్వామిగా చేయడాన్ని ఎంతమాత్రం క్షమించడు. ఈ భాగస్వామ్యం, షిర్క్ తప్ప వేరే ఏ పాపాన్నైనా తాను కోరిన వారి గురించి క్షమించవచ్చును.
మరియు షిర్క్ ఎంత ఘోరమైన పాపం? అదే ఆయతులో ఉంది.
وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدِ افْتَرَىٰ إِثْمًا عَظِيمًا [వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖదిఫ్తరా ఇస్మన్ అజీమా] అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించినవాడు ఘోర పాపంతో కూడిన కల్పన చేశాడు. (4:48)
ఒక నష్టం అయితే తెలుసుకున్నాం కదా, అల్లాహ్ క్షమించడు అని. రెండవది, ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తారో, అల్లాహ్తో పాటు ఇతరులను షిర్క్ చేస్తారో, అతను ఒక మహా భయంకరమైన ఘోర పాపానికి పాల్పడినవాడైపోతాడు. అందుకని మనం షిర్క్ నుండి చాలా దూరం ఉండాలి. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి, అల్లాహు త’ఆలా షిర్క్ను ముమ్మాటికీ క్షమించడు అని ఏదైతే చెప్పడం జరుగుతుందో, ఆ మనిషి షిర్క్ చేసే వ్యక్తి బ్రతికి ఉండి తౌబా చేసుకుంటే కూడా మన్నించడు అని భావం కాదు. ఎవరైతే షిర్క్ స్థితిలో చనిపోతారో వారిని మన్నించడు. కానీ ఎవరైతే బ్రతికి ఉన్నారు, తౌబా చేసుకున్నారు, షిర్క్ను వదులుకున్నారు, తౌహీద్ పై వచ్చేసారు, ఏకైక అల్లాహ్ను నమ్ముకుని అతని ఆరాధనలో ఎవరినీ భాగస్వామిగా చేయడం లేదు, వారు తౌబా చేశారు, వారి తౌబాను అల్లాహ్ తప్పకుండా స్వీకరిస్తాడు.
ఇదే సూరె నిసా ఆయత్ నెంబర్ 116 లో అల్లాహు త’ఆలా ఇలా హెచ్చరించాడు.
إِنَّ اللَّهَ لَا يَغْفِرُ أَن يُشْرَكَ بِهِ وَيَغْفِرُ مَا دُونَ ذَٰلِكَ لِمَن يَشَاءُ [ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహీ వ యగ్ఫిరు మాదూన దాలిక లిమన్ యషా] “తనకు భాగస్వామ్యం (షిర్క్) కల్పించటాన్ని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించడు. షిర్క్ మినహా తాను కోరిన వారి ఇతర పాపాలను క్షమిస్తాడు.“
وَمَن يُشْرِكْ بِاللَّهِ فَقَدْ ضَلَّ ضَلَالًا بَعِيدًا [వ మన్ యుష్రిక్ బిల్లాహి ఫఖద్ దల్ల దలాలన్ బఈదా] అల్లాహ్కు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టినవాడు మార్గభ్రష్టతలో చాలా దూరం వెళ్ళి పోయాడు. (4:116)
మరి ఎవరైతే, మరి ఎవరైతే అల్లాహ్తో పాటు ఇతరులను భాగస్వాములుగా చేస్తున్నారో, అతను సన్మార్గం నుండి దూరమై మార్గభ్రష్టత్వంలో ఎంతో దూరం వెళ్ళిపోయాడు. అందుకు, ఇలా మార్గభ్రష్టత్వంలో దూరం వెళ్ళిపోతూ ఉండేదానికి బదులుగా సన్మార్గం వైపునకు వచ్చేసేయాలి, తౌహీద్ను స్వీకరించాలి.
సృష్టిలో ఎవరు ఎంత గొప్పవారైనా, ఎంత పెద్ద హోదా అంతస్తులు కలవారైనా, చివరికి ప్రవక్తలైనా గాని, వారి కంటే గొప్పవారు ఎవరుంటారండి? వారి నుండి కూడా షిర్క్ లాంటి పాపం ఏదైనా జరిగిందంటే, అల్లాహు త’ఆలా వారి సర్వ పుణ్యాలను, సత్కార్యాలను తుడిచి పెడతానని హెచ్చరించాడు.
వాస్తవానికి ప్రవక్తల ద్వారా ఎన్నడూ షిర్క్ జరగదు. ప్రవక్తలందరూ కూడా చనిపోయారు. వారు షిర్క్ చేయలేదు. కానీ ఈ హెచ్చరిక, వారి ప్రస్తావన తర్వాత ఈ హెచ్చరిక అసల్ మనకు హెచ్చరిక.
“(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీ వద్దకు, నీ పూర్వీకులైన ప్రవక్తల వద్దకు పంపబడిన సందేశం (వహీ) ఇది : “ఒకవేళ నువ్వు గనక బహుదైవారాధనకు పాల్పడితే నువ్వు చేసుకున్నదంతా వృధా అయిపోతుంది. మరి నిశ్చయంగా నువ్వు నష్టపోయినవారిలో చేర్తావు.” (39:65)
మీ వైపునకు మరియు మీ కంటే ముందు గతి౦చిన ప్రవక్తల వైపునకు మేము ఇదే వహీ చేశాము. ఏమని? నీవు గనక షిర్క్ చేస్తే నీ సర్వ సత్కార్యాలు వృథా అయిపోతాయి. మరియు పరలోకాన నీవు చాలా నష్టంలో పడిపోయిన వారిలో కలుస్తావు.
ఎందుకు మహాశయులారా, సృష్టికర్త ఒకే ఒక్కడు. మనందరినీ సృష్టించిన వాడు, భూమి ఆకాశాల్ని సృష్టించిన వాడు, ఈ సృష్టంతటినీ సృష్టించినవాడు ఒక్కడే. మరి ఆయన ఒక్కరి ముందే మన తల వంచితే, ఆయన ఒక్కరి ముందే మనము నమాజు చేస్తే, ఆయన ఒక్కనితోనే మన కష్టాల గురించి మొరపెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత న్యాయం ఉంటుంది. మనము కూడా ఇలాంటి శిక్షల నుండి ఎంత రక్షింపబడతాము.
రండి సోదరులారా! షిర్క్ను వదులుకోండి. మహా ఘోరమైన పాపం. అల్లాహ్ క్షమాపణ అనేది మనకు ప్రాప్తి కాదు. మరియు అదే స్థితిలో చనిపోయామంటే శాశ్వతంగా నరకంలో కాలడంతో పాటు మన సత్కార్యాలు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతాయి. వాటి ఏ లాభం మనకు పరలోకంలో దొరకదు. అందుగురించి ప్రతీ వ్యక్తి అన్ని రకాల షిర్క్ నుండి దూరం ఉండాలి. షిర్క్ యొక్క దరిదాపులకు కూడా తాకకుండా ఉండాలి.
ధర్మభ్రష్టత (రిద్దత్)
ఇక మహాశయులారా, ఏ పాపాల వల్ల మన పుణ్యాలన్నీ కూడా నశించిపోతాయో, వాటిలో అవిశ్వాసం, సత్య తిరస్కారం, మరియు సత్యాన్ని స్వీకరించిన తర్వాత మళ్ళీ తిరిగి మార్గభ్రష్టత్వానికి వెళ్ళడం, ఇస్లాంను త్యజించడం, రిద్దత్ అని దీన్ని అంటారు, ఇవి మహా ఘోరమైన పాపాలు. అయితే, మనిషి ఏ పాపాలు చేయడం వల్ల లేదా ఎలాంటి కార్యం చేయడం వల్ల సత్య తిరస్కారానికి గురి అవుతాడు, అవిశ్వాసుడైపోతాడు, లేదా అతడు ముర్తద్ అయిపోయాడు, ధర్మభ్రష్టుడయ్యాడు అని అనడం జరుగుతుంది, ఆ కార్యాల గురించి మనం తెలుసుకుందాము.
(1) ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం
అందులో మొదటిది, ధర్మం మరియు ధర్మాన్ని అవలంబించే వారిని పరిహసించడం, ఎగతాళి చేయడం. మహాశయులారా ఇది ఘోరమైన పాపం. ప్రవక్త కాలంలో వంచకులు, కపట విశ్వాసులు ఇలాంటి పాపానికి గురి అయ్యేది.
ఇది ఎంత చెడ్డ అలవాటు అంటే ఎవరైతే దీనికి పాల్పడతారో వారు ధర్మభ్రష్టతకు గురి అవుతారు, విశ్వాసాన్ని కోల్పోతారు అని అల్లాహు త’ఆలా సూరతు తౌబా ఆయత్ నెంబర్ 65 మరియు 66 లో తెలియజేశాడు.
“(మీరు చెప్పుకుంటూ ఉన్న విషయం ఏమిటి? అని) నువ్వు వారిని అడిగితే, “అబ్బే ఏమీలేదు. ఏదో సరదాగా, నవ్వులాటకు ఇలా చెప్పుకుంటున్నాము” అని వారంటారు. “ఏమిటీ, మీరు అల్లాహ్తో, ఆయన ఆయతులతో, ఆయన ప్రవక్తలతో పరిహాసమాడుతున్నారా? అని అడుగు.మీరింక సాకులు చెప్పకండి. మీరు విశ్వసించిన తరువాత అవిశ్వాసానికి ఒడిగట్టారు.” (9:65-66)
మీరు వారిని అడగండి, ఒకవేళ మీరు వారిని అడిగితే, ప్రశ్నిస్తే, వారేమంటారు? మేము అలాగే ఆట, పరిహాసం, వినోదం, దీని గురించి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటిమి, అని వారు సమాధానం పలుకుతారు. అయితే వారితో చెప్పండి, మీ పరిహాసం, మీ ఆట వినోదానికి అల్లాహ్, అల్లాహ్ యొక్క ఆయతులు మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తయేనా మీకు దొరికింది? వీరితోనా మీరు పరిహసించేది? వీరినా మీరు ఎగతాళి చేసేది? లా త’తదిరూ, ఇక మీరు ఏ సాకులు చెప్పకండి. ఖద్ కఫర్తుమ్ బ’ద ఈమానికుమ్. ఈమాన్ తర్వాత మీరు కుఫ్ర్కు గురి అయ్యారు. విశ్వాసం తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. విశ్వాస మార్గంలో వచ్చిన తర్వాత సత్య తిరస్కారానికి గురి అయ్యారు.
వారితో అడగండి అని ఏదైతే చెప్పడం జరిగిందో ఈ ఆయతులో, వంచకుల విషయం అది. వంచకులు ప్రయాణంలో తిరిగి వస్తున్న సందర్భంలో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ సహచరులైతే ఖురాన్ కంఠస్థం చేసి, ఖురాన్ పారాయణం చేస్తూ, వాటి అర్థభావాలను తెలుసుకుంటూ, దాని ప్రకారంగా ఆచరిస్తూ, దాని వైపునకు ఇతరులను ఆహ్వానిస్తూ, జీవితం గడిపేవారో, అలాంటి పుణ్యాత్ముల, అలాంటి ధర్మాన్ని మంచి విధంగా అవలంబించిన వారి ఎగతాళి ఏదైతే వారు చేస్తూ ఉన్నారో, వారిని ఏదైతే పరిహసిస్తూ ఉన్నారో, ఆ విషయంలో వారిని అడగండి వారు ఎందుకు ఇలా చేశారు. దానికి సమాధానంగా వారు అన్నారు, ప్రయాణం క్షేమంగా జరగడానికి ఏదో కొన్ని నవ్వులాటలు చేసుకుంటాము కదా, ఏదైతే మేము కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము కదా వినోదం గురించి, అందులో ఇలాంటి మాటలు అనుకున్నాము. అయితే అల్లాహు త’ఆలా వారిని హెచ్చరిస్తున్నాడు. మీ ఆట, విలాసాలు, వినోదాలు వీటికి అల్లాహ్, అల్లాహ్ ఆయతులు, అల్లాహ్ యొక్క ప్రవక్తలా? అందుగురించి మహాశయులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి పాపానికి ఎన్నడూ కూడా మనం గురి కాకూడదు.
అల్లాహ్ మనందరికీ ధర్మభ్రష్టత నుండి కాపాడుగాక, విశ్వాసం తర్వాత అవిశ్వాసంలో పడడం నుండి కాపాడుగాక.
(2) అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకోవడం
షిర్క్, కుఫ్ర్ మరియు ధర్మభ్రష్టతకు గురిచేసే కార్యాల్లో రెండవది, అల్లాహ్ అవతరింపజేసిన మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఏ విషయాన్నైనా ‘ఇది నాకు ఇష్టం లేదు’ అని అనడం. ఇది కూడా మహా భయంకరమైన విషయం.
“అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.” (47:9)
ఇది ఎందుకు ఇలా జరిగినది అంటే, వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నారు. ఇది నాకు ఇష్టం లేదు, అని అన్నారు. అందుకని అల్లాహు త’ఆలా వారి యొక్క సర్వ సత్కార్యాలను వృథా చేశాడు. ఏ ఫలితం మిగలకుండా చేసేసాడు. గమనించారా? అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహ్యించుకున్నందువల్ల సత్కార్యాలకు ఏ సత్ఫలితం అయితే లభించాలో అది లభించకుండా ఉంటుంది. ఈ విధంగా మన త్రాసు బరువు కాకుండా తేలికగా అయిపోతుంది. నష్టమే కదా మనకు. త్రాసు బరువుగా పుణ్యాలతో సత్కార్యాలతో బరువుగా ఉంటేనే కదా మనం స్వర్గంలోకి వెళ్ళేది. అందు గురించి అల్లాహ్ అవతరింపజేసిన ఏ విషయాన్ని, నమాజ్ కానీ, ఉపవాసాలు కానీ, గడ్డము కానీ, పర్దా కానీ, ఇంకా అల్లాహు త’ఆలా ఏ ఏ ఆదేశాలు మనకిచ్చాడో, ఏ ఏ విషయాలు మనకు తెలిపాడో వాటిలో ఏ ఒక్క దానిని కూడా అసహ్యించుకోవద్దు.
అందుగురించి మహాశయులారా, ఇక్కడ ఒక విషయం చిన్నగా గమనించండి. ఏదైనా ఒక కార్యం చేయకపోవడం, అది వేరే విషయం. దానిని అసహ్యించుకొని దాని పట్ల, దాని ప్రస్తావన వస్తేనే మన మనసులో సంకోచం, ఏదైనా రోగం మొదలవడం ఇది మనల్ని అవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ఉదాహరణకు నమాజ్ ఇది విధి అని, ఐదు వేళలలో పాబందీగా చేయాలని, మరియు పురుషులు సామూహికంగా జమాఅతులో మస్జిదులో పాల్గొనాలని, దీనిని నమ్మాలి. అల్లాహ్ అవతరింపజేసిన ఆదేశం ఇది. దీనిని అసహ్యించుకోవద్దు. ఇక ఎప్పుడైనా, ఎవరైనా ఏదైనా నమాజ్ తప్పిపోతే, దాని పట్ల ఒక రకమైన బాధ కూడా అతనికి ఉండాలి. కానీ, మంచిగానే జరిగింది. నమాజ్ అంటే నాకు అట్లా కూడా ఇష్టమే లేదు, ఇలా అనడం మహా పాపానికి, అవిశ్వాసానికి ఒడిగట్టినట్లు అవుతుంది. ఎవరైనా ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు. ఒక సమాజంలో, ఎలాంటి సమాజం అంటే అక్కడ గడ్డం ఉంచడం అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అతను తన గడ్డాన్ని ఉంచలేకపోతున్నాడు. కానీ, “ఈ గడ్డం ఉండాలి అని ఆదేశించడం, ఇట్లాంటి ఆదేశాలన్నీ నాకు నచ్చవండి. గడ్డం అంటేనే నేను అసహ్యించుకుంటాను“, అని అనడం గడ్డం ఉంచకపోవడం కంటే మహా పాపం.
ఇదే విధంగా, కొన్ని హలాల్ కార్యాలు ఉంటాయి. ఉదాహరణకు అల్లాహు త’ఆలా జంతువుల మాంసాన్ని మన కొరకు ధర్మసమ్మతంగా చేశాడు. తినడం కంపల్సరీ కాదు. కానీ వాటిని ధర్మంగా భావించాలి. అరే లేదండి ఇది ఎట్లా ధర్మం అవుతుంది? ఇదంటే నాకు ఇష్టమే లేదు. ఈ విధంగా అసహ్యించుకోవడం, అల్లాహ్ ఆదేశాన్ని ‘నాకు ఇది ఏ మాత్రం ఇష్టం లేదు’ అని అనడం, ఇది అవిశ్వాసానికి గురి చేస్తుంది. ఈ విధంగా మహాశయులారా, వేరే కొన్ని ధర్మ సమ్మతమైన విషయాలు కూడా అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం వేరు విషయం. వాటిని మనం తినకపోవడం, వాటిని మనం ఉపయోగించకపోవడం అది వేరే విషయం. కానీ వాటిని అసహ్యించుకొని వదలడం ఇది మహా పాపానికే కాదు, అవిశ్వాసానికి గురి చేస్తుంది. అందుగురించి చాలా జాగ్రత్తగా ఉండాలి.
(3) అల్లాహ్కు ఇష్టం లేని దాన్ని అనుసరించడం
సత్కార్యాలను వృధా చేసి, ధర్మభ్రష్టత, కుఫ్ర్, అవిశ్వాసంలో పడవేసే మూడో విషయం, అల్లాహ్కు ఇష్టమైన దానిని మొత్తానికి వదిలేసి, దానిని ఆచరించకుండా ఉండి, అల్లాహ్కు ఏ విషయమైతే ఇష్టం లేదో దాని వెంట పడడం. ఇది కూడా మన సర్వ సత్కార్యాలను, సర్వ సత్కార్యాల సత్ఫలితాన్ని మట్టిలో కలుపుతుంది.
“వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్ వారి కర్మలను వృధా గావించాడు.” (47:28)
ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, దానికంటే ముందు ఆయతును చదివితే ఆ విషయం తెలుస్తుంది, చనిపోయే సందర్భంలో వారికి దేవదూతలు ఏ శిక్షలైతే విధిస్తున్నారో, ఇది ఎందుకు జరిగిందంటే, అల్లాహ్కు ఇష్టం లేనిది మరియు ఆయన్ని ఆగ్రహానికి గురి చేసే దానిని వారు అనుసరించారు. వకరిహూ రిద్వానహూ, మరియు ఆయనకు ఇష్టమైన, ఆయనకు ఇష్టమైన దానిని అసహ్యించుకున్నారు. ఇష్టం లేని దానిని ఇష్టపడి దానిని అనుసరించారు. మరి ఏదైతే అల్లాహ్కు ఇష్టం ఉన్నదో దానిని వదులుకున్నారు, దానిని అసహ్యించుకున్నారు. ఫ అహ్బత అ’మాలహుమ్, అందుకని అల్లాహు త’ఆలా వారి సత్కార్యాల సత్ఫలితాన్ని భస్మం చేశాడు. ఏ మాత్రం వారికి సత్ఫలితం లభించకుండా చేశాడు. ఈ విధంగా వారు నష్టపోయారు.
అందుకని మహాశయులారా, ధర్మభ్రష్టత అనేది చాలా భయంకరమైన విషయం. విశ్వాసంపై ఉన్న తర్వాత అవిశ్వాసంలో అడుగు పెట్టడం. విశ్వాస మార్గాన్ని అవలంబించి విశ్వాసానికి సంబంధించిన విషయాలను అసహ్యించుకొనడం, అల్లాహ్కు ఇష్టం లేని దాని వెంట పడడం, ఇష్టమైన దానిని వదిలివేయడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మన సత్ఫలితాలన్నిటినీ భస్మం చేసి మట్టిలో కలిపి మనకు ఏ లాభం దొరకకుండా చేస్తాయి. అందుగురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
మరియు ఈ రోజుల్లో ఎన్నో రకాలుగా ఇలాంటి పాపాలకు ఎందరో గురి అవుతున్నారు. వారు ఇలాంటి ఆయతులను చదివి, భయకంపితలై ధర్మం వైపునకు మరలి, ధర్మంపై స్థిరంగా ఉండే ప్రయత్నం చేయాలి.
అల్లాహు త’ఆలా నాకు, మీకు అందరికీ సన్మార్గం ప్రసాదించి, వాటిపై స్థిరంగా ఉండే భాగ్యం ప్రసాదించుగాక.
మన యొక్క త్రాసును తేలికగా చేసే మరియు దాని బరువును నశింపజేసే పాప కార్యాలు ఏమిటో మరిన్ని మనం ఇన్షాఅల్లాహ్ తర్వాయి భాగాల్లో తెలుసుకుందాము. మా ఈ కార్యక్రమాలను మీరు చూస్తూ ఉండండి. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
శ్రద్ధగా చదవండి, అందరికీ తెలియజేసి చెడుల నుండి ఆపండి
గౌరవనీయులైన సోదరులారా మరియు మిత్రులారా! 2025 సంవత్సరం ముగిసి మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. వాస్తవానికి ఈ విషయాన్ని ఒక అంశంగా చేసి ప్రసంగించాల్సిన అవసరం లేదు, కానీ ముస్లిం సమాజంలో చెడు వేళ్లూనుకుంటున్నప్పుడు, మతరాహిత్యం పెరుగుతున్నప్పుడు, ముస్లిమేతరుల ఆచార వ్యవహారాలను ముస్లింలు అవలంబిస్తున్నప్పుడు, ఒక నిజమైన ఇస్లామిక్ పండితుడి బాధ్యతగా సమాజాన్ని సంస్కరించడం కోసం ఈ విషయాలను చర్చించాల్సి ఉంటుంది.
మిత్రులారా! కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఇస్లాంలో అనుమతి ఉందా? మొదటగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అది ఇస్లామిక్ క్యాలెండర్ అయినా లేదా ముస్లిమేతరుల క్యాలెండర్ అయినా, కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దానికి ప్రత్యేక స్వాగతం పలకడం లేదా వేడుకలు జరుపుకోవడం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ద్వారా నిరూపించబడలేదు. ఇస్లామిక్ నెలల ప్రారంభంలోనే ఇటువంటి వేడుకలు లేనప్పుడు, ముస్లిమేతరుల క్యాలెండర్ ప్రకారం వేడుకలు జరుపుకోవడం మరియు వారిని అనుకరించడం ఎంతవరకు సమంజసం?
నా స్వల్ప జ్ఞానం మరియు అనుభవం ప్రకారం, మూడు కారణాల వల్ల ఈ వేడుకలు జరుపుకోవడం ఇస్లాంలో నిషిద్ధం (హరామ్):
ప్రస్తుత కాలంలో కొత్త సంవత్సర వేడుకలు ఒక పండుగ రూపం దాల్చాయి. ముస్లింలకు సంవత్సరానికి రెండు పండుగలు (ఈద్) మాత్రమే ఉన్నాయని మనకు తెలుసు.
ఇది ముస్లిమేతరుల ఆచారం. వారిని అనుకరించడం ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నిషేధించారు.
ఇది క్రైస్తవులు జరుపుకునే క్రిస్మస్ వేడుకల కొనసాగింపు లాంటిది.
డిసెంబర్ 31 రాత్రి యువతీ యువకులు గుమిగూడటం, పార్టీలు చేసుకోవడం, బహుమతులు ఇచ్చుకోవడం వంటివి చేస్తారు. కొందరు విద్యావంతులు దీనిని కేవలం ఒక సామాజిక మర్యాదగా భావించి శుభాకాంక్షలు తెలుపుతుంటారు. కానీ ఇటువంటి వేడుకలలో అల్లాహ్ కు నచ్చని కార్యాలు, షిర్క్ (బహుదైవారాధన) వంటివి ఉంటాయి. అల్లాహ్ ఖురాన్ లో ఇలా సెలవిచ్చాడు:
“ఒకవేళ మీరు గనుక కృతఘ్నతకు (కుఫ్ర్ కు) ఒడిగడితే, (తెలుసుకోండి) అల్లాహ్ కు మీ అవసరమేమీ లేదు. ఆయన తన దాసుల కుఫ్ర్ ను ఇష్టపడడు. ఒకవేళ మీరు కృతజ్ఞత చూపిస్తే ఆయన దానిని మీ పట్ల ఇష్టపడతాడు.” (ఖురాన్, సూరా అజ్-జుమర్, 39:7)
మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అనుకరణ గురించి ఇలా హెచ్చరించారు:
مَنْ تَشَبَّهَ بِقَوْمٍ فَهُوَ مِنْهُمْ “ఎవరైతే ఒక జాతిని అనుకరిస్తారో, వారు వారిలో భాగమే.” (సునన్ అబూ దావూద్: 4031)
جُعِلَ الذِّلَّةُ وَالصَّغَارُ عَلَى مَنْ خَالَفَ أَمْرِي “నా ఆజ్ఞను ఉల్లంఘించే వారికి అవమానం మరియు నీచత్వం ప్రాప్తిస్తాయి.” (ముస్నద్ అహ్మద్)
ఈ రాత్రి వేడుకల పేరుతో హోటళ్లు, పార్కులు బుక్ చేసుకుంటారు. అక్కడ అశ్లీలత, బేషరమి (సిగ్గులేకపోవడం) మరియు అనేక పాపాలు జరుగుతాయి. ముఖ్యంగా కాలేజీ మరియు యూనివర్సిటీ విద్యార్థులు ఇందులో ఎక్కువగా పాల్గొంటారు. ఇక్కడ స్త్రీ పురుషుల కలయిక (ఇఖ్తిలాత్) జరుగుతుంది. ఇస్లాం దీనిని తీవ్రంగా ఖండించింది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు మహిళల విషయంలో జాగ్రత్తగా ఉండండి (అంటే వారి ద్వారా కలిగే పరీక్షల గురించి). ఎందుకంటే బనీ ఇస్రాయీలీలలో మొదటి ఫిత్నా (పరీక్ష/వైపరీత్యం) మహిళల ద్వారానే కలిగింది.” (సహీహ్ ముస్లిం: 2742)
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కాలంలో మహిళలు ఎంతటి మర్యాదను పాటించేవారంటే, ఒకసారి రోడ్డుపై పురుషులు, మహిళలు కలిసి నడుస్తుండటం చూసి, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహిళలతో ఇలా అన్నారు: “మీరు వెనుకకు ఉండండి, రోడ్డు మధ్యలో నడవడం మీకు తగదు, మీరు రోడ్డు పక్కన నడవండి.” అప్పటి నుండి మహిళలు గోడను ఆనుకుని ఎంత పక్కగా నడిచేవారంటే, వారి బట్టలు గోడకు తగిలేవి.
కానీ నేడు కొత్త సంవత్సరం పేరుతో ముస్లిం యువతులు బురఖాలు తీసేసి, అపరిచిత పురుషులతో కలిసి కేక్ కటింగ్ లు, పార్టీలు చేసుకుంటున్నారు. ఇది వారి తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“మీలో ఒకరి తలలో ఇనుప మేకుతో పొడవబడటం, తనకు నిషిద్ధమైన (అపరిచిత) స్త్రీని తాకడం కంటే మేలు.” (అల్-ముజామ్ అల్-కబీర్)
మద్యం గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా హెచ్చరించారు: మద్యం తాగేవాడి 40 రోజుల నమాజు అంగీకరించబడదు. ఒకవేళ ఆ స్థితిలో మరణిస్తే అతను జహన్నం (నరకం) లోకి వెళ్తాడు. వ్యభిచారం గురించి కూడా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. పొరుగువాని భార్యతో వ్యభిచారం చేయడం పదిమంది ఇతర స్త్రీలతో వ్యభిచారం చేయడం కంటే పెద్ద పాపం.
తల్లిదండ్రులారా! మీ పిల్లలు మీ దగ్గర అల్లాహ్ ఇచ్చిన అమానత్. వారి పట్ల మీరు రేపు సమాధానం చెప్పుకోవాలి. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు:
“మీలో ప్రతి ఒక్కరూ పాలకులే (బాధ్యులే) మరియు ప్రతి ఒక్కరూ తన పాలన (బాధ్యత) గురించి ప్రశ్నించబడతారు.” (సహీహ్ బుఖారీ: 893)
చివరగా నా విన్నపం ఏమిటంటే, ఈ రెండు రోజులు మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. అవసరమైతే మీ ఉద్యోగాలకు సెలవు పెట్టి అయినా సరే వారిని ఇటువంటి పాపపు వేడుకలకు వెళ్లకుండా కాపాడుకోండి. అల్లాహ్ మనందరికీ హిదాయత్ (సన్మార్గం) ప్రసాదించుగాక.
జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వ రహమతుల్లాహి వ బరకాతుహు. ముహమ్మద్ నసీరుద్దీన్ జామిఈ +966533458589
దీన్ని షేర్ చెయ్యండి మీ బంధుమిత్రులతో , బారకల్లాహు ఫీకుమ్: “మంచికి మార్గనిర్దేశం చేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది” [సహీహ్ ముస్లిం, 3వ భాగం, నం .4665] ఈ క్రింది లింక్ దర్శించి మీ స్నేహితులు మరియు బంధువులు మా వాట్సాప్ గ్రూపులో చేరవచ్చు: teluguislam.net/whatsapp/. మా టెలిగ్రామ్ ఛానల్ https://t.me/teluguislam .మా యూట్యూబ్ ఛానల్: youtube.com/c/teluguislam . జిక్ర్ & దుఆల కోసం కొత్త వెబ్సైటు: telugudua.net
You must be logged in to post a comment.